హయత్‌నగర్, ఫిబ్రవరి 14: హయత్‌నగర్‌లోని నార్ముల్ మదర్ డెయిరీలో ఓ ఉద్యోగి బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతిచెందాడు. ఆ సంస్థలో కొన్నేండ్ల నుంచి ప్రీ ప్యాక్ సెక్షన్ సూపర్వైజర్గా పనిచేస్తున్న తులసిగారి బాలనరసింహ(46) శుక్రవారం విధినిర్వహణలో ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. తోటి ఉద్యోగులు అప్రమత్తమై తొలుత ఆయనను వనస్థలిపురంలోని ఈవ్య హాస్పిటల్‌కు, ఆ తర్వాత మలక్‌పేటలోని యశోదకు తరలించా రు.
ఆపరేషన్ చేయాలని, భారీగా ఖర్చు అవుతుందని చెప్పారు. దీంతో కుటుంబసభ్యులు బాలనర్సింహను గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మదర్ డెయిరీ ఉద్యోగులకు జీతాలు చెల్లించకపోవడం తో బాలనర్సింహ తీవ్ర మానసిక క్షోభ కు గురైనట్టు తెలుస్తున్నది. బాలనర్సింహ మృతికి మదర్ డెయిరీ యాజమాన్యమే కారణమని ఆయన మృతదేహంతో కు టుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.