PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
PM Modi : ఇండియా-పోలండ్ మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మధ్య గురువారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
PM Modi : ఇండియా-పోలండ్ మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందాలు ఖరారయ్యాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మధ్య గురువారం న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య అనేక ఒప్పందాలు కుదిరాయి. పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ ఇండియాలో పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్ వేదికగా ఇరు నేతలు, ఉన్నతాధికారుల మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి.
రెండు దేశాల మధ్య వ్యాపార, వాణిజ్యాన్ని 2030కల్లా రెట్టింపు చేయాలని నేతలు నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. పోలండ్, ఇండియా మధ్య కొనసాగుతున్న వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వామ్యంపై హర్షం వ్యక్తం చేశారు. పోలండ్ జీడీపీ 1 ట్రిలియన్ డాలర్లు దాటినందుకు హర్షం వ్యక్తం చేశారు. ఈ అంశంపై పోలండ్ ప్రధానికి అభినందనలు తెలిపారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పోలండ్ కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.
పోలండ్‌లో ఇండియాకు చెందిన అనేక ఐటీ కంపెనీలు సేవలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య ఐటీ, సైబర్ సెక్యూరిటీ అంశాల్లో మంచి సంబంధాలు కొనసాగుతున్నాయన్నారు. ఇండియా-పోలండ్ మధ్య స్టార్టప్ బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ మాట్లాడారు. ఇండియా-పోలండ్ మధ్య సంబంధాలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. రెండు దేశాలు ఒకదానికొకటి మద్దతుగా నిలుస్తూ, పరస్పరం ప్రయోజనం పొందాలన్నారు. ఇరు దేశాల్లో రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు శాటిలైట్లు, డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడ్డాయన్నారు.
ఇండియా స్థాయిని పోలండ్ ఎప్పటికీ తగ్గించబోదని ఆయన హామీ ఇచ్చారు. అరుదైన ఖనిజాలు, వనరులు వంటి విషయాల్లో ప్రతి దేశం స్వతంత్రంగా వ్యవహరించాలనే విషయాన్ని తాజా పరిణామాలు నిరూపించాయన్నారు. మరోవైపు.. రష్యా-ఉక్రెయిన్ అంశంపై ప్రధాని మోదీ స్పందించారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అవసరమైన శాంతి ప్రక్రియలో ఇండియా కీలకంగా ఉంటుందన్నారు. శాంతి స్థాపనకు ఇండియా కట్టుబడి ఉంటుందన్నారు. అది రష్యా-ఉక్రెయిన్ యుద్ధమైనా సరే.. మిడిల్ ఈస్ట్ సంక్షోభం అయినా సరే.. శాంతిస్థాపన కోసం అవసరమయ్యే అర్ధవంతమైన చర్చలకు ఇండియా మద్దతు ఇస్తుందని మోదీ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Donald Tusk
- Pm Modi
- Poland
- Ukraine
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

