కుప్పిలి శ్రీనివాస్, హ్రితిక సింగ్, సాధన పవన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘సెక్సీ స్టార్’. సుమన్, సమీర్, కృష్ణ భగవాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చిన్ని కుప్పిలి సమర్పణలో శ్రీ సూర్య నారాయణ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్నది. కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉందీ సినిమా. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను హైదరాబాద్లో నటుడు సుమన్ విడుదల చేశారు. యువతకు నచ్చేలా రొమాంటిక్ అంశాలతో సినిమాను రూపొందించామని, ఈ కథలో తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కూడా ఉంటుందని నిర్మాత తెలిపారు.