గంగూబాయి యుక్త వయసులోనే ముంబయి కామాటిపుర విషకూపంలోకి నెట్టబడిన ఓ వేశ్య. తొలినాళ్లలో దినదినగండలా బతుకును సాగించిన ఆమె కాలగమనంలో ముంబయిలో బలమైన శక్తిగా ఎదుగుతుంది. రాజకీయ అండతో మహిళా సమస్యలపై తనదైన పంథాలో పోరాటం సాగిస్తుంది. ఆమె జీవితాన్ని ఆవిష్కరిస్తూ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. అలియాభట్ టైటిల్ రోల్‌ని పోషించింది. పెన్ స్టూడియోస్ పతాకంపై సంజయ్‌లీలా భన్సాలీ, జయంతిలాల్ గడ నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. వేశ్యగా ప్రయాణాన్ని మొదలుపెట్టి ఓ ప్రాంతాన్ని శాసించే నాయకురాలిగా గంగూబాయి ఎదిగిన వైనాన్ని ట్రైలర్లో ఆవిష్కరించారు. 60దశకం నాటి ముంబయి కామాటిపుర వాతావరణాన్ని కళ్లకు కట్టారు. ‘మీ కంటే ఎక్కువ మానం మా దగ్గర ఉంటుంది. మీ మానం ఒక్కసారి పోయిందంటే పోయినట్లే. మేమైతే రోజూ మా మానాన్ని అమ్ముకుంటాం. అది అంతమే అవ్వదు’.. ‘ఒట్టేసి చెబుతున్నా. మా పిల్లలందరికి చదువులు నేర్పించే తీరతాను. సమాజంలో మనుషులుగా బతికే హక్కు సాధించే తీరతాను’..‘ఆజాద్ మైదానంలో ఉపన్యాసం ఇస్తున్నప్పుడు గంగుబాయి తలదించుకొని కాదు..తలెత్తుకొని తన హక్కుల గురించి మాట్లాడుతుంది’ అనే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.