Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం ‘క’ అంటే థియేటర్‌కు వస్తారా?
కిరణ్ అబ్బవరం 'క' అంటూ ప్రేక్షకులను పలకరిచండానికి సిద్దమవుతున్నాడు.వరుస ఫ్లాపులతో మార్కెట్ లేని కిరణ్‌తో అంత బడ్జెట్‌తో సినిమా చేయడం రిస్కేనని అంటున్నాయి సినీ వర్గాలు.
షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించి.. రాజా వారు రాణి వారు చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు కిరణ్ అబ్బవరం. తొలిచిత్రం సక్సెస్‌ను అందుకున్న ఆ తరువాత ఎస్ఆర్ కల్యాణ్ మండపం అనే మోస్తరు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఈ యువ నటుడు. ఇక ఆ తరువాత ఈ హీరో నటించిన సెబాస్టియన్, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యం విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్ ఇలా అరడజనుకు పైగా డిజాస్టర్లను కైవసం చేసుకున్నాడు.
అయితే అయినా కిరణ్ అబ్బవరం సినిమాల బడ్జెట్ తగ్గలేదు. ఇప్పటికీ ఆయనతో సినిమా అంటే 10 కోట్లకు పైమాటే అంటున్నాడు తాజాగా కిరణ్ అబ్బవరం ‘క’ అంటూ ప్రేక్షకులను పలకరిచండానికి సిద్దమవుతున్నాడు. పీరియాడిక్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి సిద్దమవుతున్నాడు.
సుజీత్, సందీప్ జంట ద్వయం దర్శకత్వంలో నూతన నిర్మాత చింతా గోపాలకృష్టా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఈ చిత్రం కోసం దాదాపు 15 కోట్లకు పైనే ఖర్చు పెట్టారని తెలిసింది. అయితే వరుస ఫ్లాపులతో మార్కెట్ లేని కిరణ్‌తో అంత బడ్జెట్‌తో సినిమా చేయడం రిస్కేనని అంటున్నాయి సినీ వర్గాలు. అంతేకాదు ప్రస్తుతం ప్రేక్షకులు చిన్న హీరోల సినిమాలకు, చిన్న సినిమాలకు థియేటర్స్‌కు రావడం కష్టంగా వుంది.
నిజం చెప్పాలంటే చిన్న సినిమాల కంటెంట్ బాగున్నా థియేటర్స్ వరకు రావడం లేదు. ఇటువంటి సినిమాలను ఓటీటీలో చూద్దాంలే అని స్కిప్ చేస్తున్నారు. ఇటీవల మంచి టాక్ తెచ్చుకున్నా.. బర్త్‌డే బాయ్, కమిటీ కుర్రాళ్లు, ఆయ్ లాంటి చిన్ని సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా కాకుండా కష్టపడుతున్నాయి. ఇందులో ఆయ్ సినిమా మాత్రమే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.సో.. కిరణ్ అబ్బవరం ‘క’ అంటూ ప్రేక్షకులను థియేటర్‌కు రమ్మంటే వస్తారా.. ఏమో సందేహమే.. వేచి చూద్దాం..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

