టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్ ఇంకొద్దిసేపట్లో దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది. రాత్రి 7.30 కు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే.. మ్యాచ్ ఇంకా జరగకముందే.. కొందరు ఫలితాన్ని ఊహించేస్తున్నారు. క్రికెట్ అభిమానులు.. ఏ టీమ్ గెలుస్తుందో ముందే చెప్పేస్తున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పోటీ పడనున్నాయి. ఈ రెండు టీమ్స్ కెప్టెన్స్ ట్రోఫీ ముందు నిలబడి దిగిన ఫోటోను ఐసీసీ ఇటీవలే ట్విట్టర్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు టీ20 వరల్డ్ కప్ 2021 టైటిల్ విన్నర్ ఎవరో చెప్పేసారు. అదేంటి.. మ్యాచ్ జరగకముందే అలా ఎలా చెప్పేస్తారు అంటారా?
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లలో మొదటి నుంచి ఓ సెంటిమెంట్ కొనసాగుతూ వస్తోంది. అదేంటంటే.. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇరు టీమ్‌ల కెప్టెన్లు దిగిన ఫోటోలలో ఎవరైతే ఎడమ వైపు నిలుచుంటారో వాళ్లదే కప్ అని. ఇది అన్నిసార్లు నిజం అయింది కానీ.. ఒక్క 2014లో మాత్రం గురితప్పింది. 2014లో భారత్, శ్రీలంక మధ్య జరిగిన పోరులో శ్రీలంక కప్ సాధించింది. ఆ ఒక్కసారి మాత్రం మిస్ అయింది. మిగితా అన్ని మ్యాచ్‌లలో ఎడమవైపున నిలుచున్న కెప్టెన్ టీమే ట్రోఫీని ఎగరేసుకుపోయింది అంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో డిబేట్ పెట్టారు.
ఈసారి ఆస్ట్రేలియా, న్యూజిలాంట్ టీమ్స్ కెప్టెన్స్ ఆరున్ ఫించ్, కేమ్స్ విలియమ్సన్.. ఇద్దరిలో ఎడమవైపున ఫించ్ నిలుచుకున్నాడు. అంటే.. ఈసారి ట్రోఫీ ఆస్ట్రేలియాదే అంటూ అంచనా వేస్తున్నారు.
ట్విట్టర్లో ఇప్పటి వరకు జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ల ఫోటోలు అన్నీ ఒకదగ్గర చేర్చి వాటి మీద పెద్ద డిబేట్ స్టార్ట్ చేశారు. అవును నిజమే.. ఈసారి కప్పు ఆస్ట్రేలియాదే అంటూ అందరూ ఆ ఫోటోలను షేర్ చేస్తున్నారు. చూద్దాం మరి.. ఈ సెంటిమెంట్ ఈసారి కూడా వర్కవుట్ అవుతుందో లేదో?
A common factor between these pictures ? (Except 2014)#T20WorldCupFinal pic.twitter.com/O2mr98WIOR
— Umakant (@Umakant_27) November 14, 2021
This time Aaron Finch standing in left side 👀 pic.twitter.com/ftgxQH4BnO
— Umakant (@Umakant_27) November 14, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆసీస్, కివీస్ ఎన్నిసార్లు టీ20లలో పోటీపడ్డాయి? ఏ టీమ్ ఎక్కువసార్లు గెలిచింది?
VVS Laxman | జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్