తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు సంభవించిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యభర్తల్లో భార్య మేడబోయిన చందన (23) మరణించింది. భర్త శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద తీన్మార్ మల్లన్న పాదయాత్రలో..
యాదాద్రి భువనగిరి, నవంబర్ 13 : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు సంభవించిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భార్యభర్తల్లో భార్య మేడబోయిన చందన (23) మరణించింది. భర్త శ్రీనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం గ్రామం వద్ద తీన్మార్ మల్లన్న పాదయాత్రలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మోత్కూరు నుండి అనాజిపురం మీదుగా తిరుమలగిరి వైపు పాదయాత్ర సాగుతున్న క్రమంలో వెనుక నుండి వేగంగా వచ్చిన (టీఎస్ 30 టి 7596) చౌటుప్పల్ మండలం జై కేసారానికి చెందిన లారీ మల్లన్న కాన్వాయ్‌లోని ఫార్చునర్ కారు (టీఎస్ 30 ఎల్ 444)ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో రెండు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో (టీఎస్ 04 8919) నంబర్ గల కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిలో తిరుమలగిరికి చెందిన మేడబోయిన శ్రీనాథ్, ఆయన భార్య చందనతో పాటు రెండేళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే 108 అంబులెన్స్‌లో నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో భార్య చందన మృతిచెందింది.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
తీన్మార్ మల్లన్న కాన్వాయ్‌కు ప్రమాదంలో భార్య మృతి, భర్త పరిస్థితి విషమం
Harish Rao | కాంగ్రెస్ పాలన ఎల్‌నినో కంటే ప్రమాదకరం : మాజీ మంత్రి హరీష్‌రావు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

