trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
trailer hits several vehicles | ఒక జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న 18 చక్రాల ట్రైలర్ అదుపుతప్పింది. పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు పాదచారులపైకి అది దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు.
జైపూర్: ఒక జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న 18 చక్రాల ట్రైలర్ అదుపుతప్పింది. పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు పాదచారులపైకి అది దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. (trailer hits several vehicles) రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం జైపూర్-ఢిల్లీ హైవేపై 18 చక్రాల ట్రైలర్ లారీ వేగంగా దూసుకెళ్లింది. దౌలత్పురా టోల్ ప్లాజా నుంచి అజ్మీర్ రోడ్డు వైపు వెళ్తున్న ఈ భారీ ట్రైలర్, ఫ్లైఓవర్ మీదుగా సర్వీస్ లేన్ వైపు దిగుతున్నప్పుడు అదుపుతప్పింది. జైపూర్‌లోని అనాజ్ మండి వెనుక గేటు వైపు రోడ్డు పక్కన ఉన్న రెయిలింగ్‌ను బలంగా ఢీకొట్టింది. పలు వాహనాలను ఢీకొట్టడంతో పాటు ఫుట్‌పాత్‌వైపు దూసుకెళ్లింది.
కాగా, ఈ ప్రమాదంలో ఒక పాదచారి ట్రైలర్ చక్రాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మరణించాడు. నుజ్జు అయిన కారులో ఉన్న వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ట్రైలర్ డ్రైవర్‌తో సహా ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మూడు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు ధ్వంసమైనట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ప్రమాదం తీరును తెలుసుకునేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
trailer hits several vehicles | పలు వాహనాలను ఢీకొట్టిన 18 చక్రాల ట్రైలర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

