Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
Assam: అస్సాంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాజిరంగాలో ఓ మినీబస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతిచెందారు. ఏడు మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది.
గౌహతి: అస్సాం(Assam)లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖాజిరంగాలో ఓ మినీబస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 23 మంది మృతిచెందారు. ఏడు మంది గాయపడ్డారు. గాయపడ్డవారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. ఖాజీరంగ సమీపంలో ఉన్న రోంగాజన్లో యాక్సిడెంట్ జరిగింది. బోకాఖాట్ నుంచి నాగావ్‌కు వెళ్తున్న మినీబస్సును ట్రక్కు ఢీకొట్టింది. రెండు వాహనాలు ఢీకొనడం వల్ల మినీబస్సు నుజ్జునుజ్జు అయ్యింది. బస్సులోనే అనేక మంది చిక్కుకుపోయారు. పోలీసులు, స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని గోలాఘాట్ ఎస్పీ స్వప్ననీల్ దేకా తెలిపారు.
గాయపడ్డవారిని కొహరా మోడల్ ఆస్పత్రికి తరలించారు. మినీబస్సు చాలా వేగంగా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. పార్క్ దగ్గర ఉన్న స్పీడ్ ఆంక్షలను బస్సు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. మినీబస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రమాద స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదం పట్ల అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ సంతాపం తెలిపారు. ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని, ఇది తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని ఆయన అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Bus Collision
- Kaziranga
- Truck
RELATED ARTICLES
తాజా వార్తలు
Assam: ఖాజీరంగాలో ట్రక్కు, బస్సు ఢీ.. 23 మంది మృతి, ఏడు మందికి గాయాలు
తుంగతుర్తిలో నలుగురికి కుష్టు వ్యాధి నిర్ధారణ
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

