Garry Sobers : వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం సర్ గ్యారీ సోబర్స్(Garry Sobers) కన్నుమూశాడు. మేటి ఆల్‌రౌండర్‌గా ప్రసిద్ధి చెందిన ఆయన 89 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. శుక్రవారం బార్బడోస్‌లోని స్వగృహంలో సోబర్స్ ప్రాణాలు విడిచాడు. గాడ్ గిఫ్డెడ్ క్రికెటర్‌గా కితాబులందుకున్న ఆయన మృతి పట్ల వెస్టిండీస్ క్రికెట్ సంతాపం తెలిపింది. ఒక గొప్ప ఇన్నింగ్స్ ముగిసింది. ‘ఇప్పుడే కాదు ఎప్పటికీ మా హృదయాల్లో ఉండిపోతారు..గ్యారీ సోబర్స్’ అని పోస్ట్ పెట్టింది.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16 ఏళ్లకే అడుగుపెట్టిన గ్యారీ సోబర్స్.. ఆ తర్వాత ఏడాదికే టెస్టు జట్టులోకి చ్చాడు. ఇంగ్లండ్‌పై ఆరంగేట్రం చేసిన ఆయన మొదట్లో బౌలర్‌గానే పరిగణించేవారు. కానీ, పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ (365)తో స్టార్ బ్యాటరైపోయాడు సోబర్స్.
Garry Sobers, cricket’s greatest allrounder, has died at the age of 89 pic.twitter.com/L9lUhy0J7P
— Cricinfo (@cricinfo) July 17, 2026
ఆల్‌రౌండర్‌గా అదరగొట్టిన సోబర్స్.. 20 ఏళ్ల కెరీర్లో 8,000 పరుగులు సాధించడమే కాకుండా బంతితో చెలరేగి 235 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకేఓవర్లో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడీ లెజెండ్. అంతర్జాతీయ క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన ఆయన గౌరవార్థం.. పురుషులకు ఏటా మెన్స్ అవార్డును ‘ది సర్ గ్యారీ సోబర్స్ అవార్డు’ పేరుతో ఇస్తోంది ఐసీసీ.