Andy Flower | నాకు ఆర్సీబీనే ముఖ్యం.. ఇంగ్లండ్‌కు కోచింగ్ ఇవ్వలేను..!
Andy Flower : ఇంగ్లండ్ పురుషుల జట్టు టెస్టు కోచ్ రేసు నుంచి ఆండీ ఫ్లవర్ (Andy Flower) వైదొలిగాడు. గతంలో ఇంగ్లండ్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. మళ్లీ తనకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశాడు ఫ్లవర్.
Andy Flower : ఇంగ్లండ్ పురుషుల జట్టు టెస్టు కోచ్ రేసు నుంచి ఆండీ ఫ్లవర్ (Andy Flower) వైదొలిగాడు. బ్రెండన్ మెక్కల్లమ్ (Brendon McCullum) రాజీనామా అనంతరం తదుపరి కోచ్‌గా తన పేరు పరిశీలనలో ఉందన్న వార్తలు వినిపిస్తుండగానే అతడు స్వచ్ఛందంగా తప్పుకున్నాడు. గతంలో ఇంగ్లండ్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. మళ్లీ ఆ బాధ్యతలు తీసుకునేందుకు తనకు ఏమాత్రం ఆసక్తి లేదని స్పష్టం చేశాడు ఫ్లవర్.
టెస్టు కోచ్‌గా బ్రెండన్ మెక్కల్లమ్ రాజీనామాతో పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. రాహుల్ ద్రవిడ్, రవి శాస్త్రి, ఆండీ ఫ్లవర్, జస్టిన్ లాంగర్.. ఇలా వీరింతా రేసులో ఉన్నారనే వార్తలు వైరలయ్యాయి. అయితే.. వీరిలో ఐపీఎల్లో కోచ్‌గా రాణిస్తున్న ఫ్లవర్ తనకు ఇంగ్లండ్ హెడ్‌కోచ్ పదవిపై ఆసక్తి లేదని చెప్పేశాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఈ కోచింగ్ దిగ్గజం ‘మీరు ఇంగ్లండ్ కోచ్ పదవిని ఆశించడం లేదా?’ అనే ప్రశ్నకు ‘అవును’ అని బదులిచ్చాడు.
RCB head coach Andy Flower has ruled himself out of England coaching role. pic.twitter.com/hgU8Wb8swU
— Cricbuzz (@cricbuzz) July 17, 2026
‘ప్రస్తుతం ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆర్సీబీకి కోచ్‌గా ఉన్నందున ఇంగ్లండ్ టెస్టు కోచ్‌గా వెళ్లలేను అని ఫ్లవర్ చెప్పేశాడు. ఏకకాలంలో రెండుజట్లకు కోచింగ్ ఇవ్వగలనని నేను అనుకోవడం లేదు. ఇంగ్లండ్‌లో వేసవి పూర్తైన రెండు మూడు నెలలకే ఐపీఎల్ మొదలవ్వనుంది. ఒకవేళ నేను ఇంగ్లండ్ టెస్టు కోచ్ అయితే.. అక్కడే ఉండి ఆటగాళ్లను గమనించాలి. కానీ, ఇదంతా సాధ్యపడనిపిస్తోంది. ఇదే విషయంపై నేను ఇంగ్లండ్ వేల్స్ బోర్డుతో మాట్లాడాను. ప్రస్తుతం నేను ఆర్సీబీ కోచ్‌గా చాలా సంతృప్తిగా ఉన్నాను’ అని ఫ్లవర్ వెల్లడించాడు.

ఇంగ్లండ్ అసిస్టెంట్ కోచ్‌గా 2007లో సేవలందించిన ఫ్లవర్.. 2009లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. 2014 వరకూ కోచింగ్ ఇచ్చిన అతడు.. ఆపై ఫ్రాంచైజీ క్రికెట్లో అడుగుపెట్టి అద్భుతాలు చేస్తున్నాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి టైటిల్ కోసం నిరీక్షిస్తున్న ఆర్సీబీ కలను సాకారం చేసిన ఫ్లవర్.. 19వ సీజన్లోనూ బెంగళూరును విజేతగా నిలిపి విజయవంతమైన కోచ్‌గా ప్రశంసలందుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

