Covid-19 Vaccine : వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి? ఈ ఎక్స్‌రేలు ఏం చెబుతున్నాయ్?
వ్యాక్సిన్ ఎందుకు తీసుకోవాలి? ఈ ఎక్స్‌రేలు ఏం చెబుతున్నాయ్? | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతున్నది.. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినే ఆయుధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతుందని, దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని

వాషింగ్టన్ : ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఇంకా వెంటాడుతున్నది.. కొవిడ్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు వ్యాక్సినే ఆయుధమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా కరోనా సోకుతుందని, దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని కొందరు టీకా వేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినప్పటికీ తీవ్రత తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో టీకాలు ఎందుకు తీసుకోవాలి? ఎంత ముఖ్యమో? అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరించారు.
కరోనా సోకినా తీవ్రత తక్కువ..
టీకా తీసుకున్న వారికి కరోనా సోకినా ఇన్ఫెక్షన్ తక్కువగా ఉంటుందని తెలిపారు. ఇందుకు ఆయన టీకా తీసుకున్న, తోసుకోని ఇద్దరు కొవిడ్‌కు పాజిటివ్‌గా పరీక్షించిన ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు చెందిన ఎక్స్‌రేలను పోల్చి చూపించారు. టీకా తీసుకున్న వ్యక్తుల్లో తీవ్రత తక్కువగా ఉన్నట్లు తేలింది. అలాగే వేగంగా కోలుకోవడంతో పాటు కొవిడ్ అనంతర సమస్యలు సైతం తక్కువగా ఉంటాయని ఎస్ఎస్ఎం హెల్త్, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఘసన్ కమెల్ తెలిపారు. ఆయన గతేడాది మార్చి నుంచి కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. కొవిడ్ వైరస్ న్యుమోనియా ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపారు. వైరస్ సోకితే ఊపిరితిత్తులు నీటితో నిండిపోయి, వాపు వస్తుందని తెలిపారు.
ఎక్స్‌రేలో ఏముంది?
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో వ్యాక్సిన్ తీసుకోని, తీసుకున్న వ్యక్తుల ఎక్స్‌రే ఫిల్మ్‌లతో పోల్చి చూపారు. టీకా తీసుకొని వ్యక్తుల్లో వైరల్ లోడ్ ఎక్కువ ఉన్నది. ఊపిరితిత్తులు నీటితో (తెల్లని మచ్చలు మొదటి ఎక్స్‌రేలో చూడొచ్చు) నిండిపోయాయి. దీని ద్వారా శ్వాస తీసుకొనే సమయంలో ఆక్సిజన్ వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో కలుగుతుంది. వ్యాక్సిన్ వేసుకొని కొవిడ్‌కు పాజిటివ్‌గా పరీక్షించిన వ్యక్తుల్లో వైరల్ లోడ్ తక్కువగా (తెల్లని మచ్చలు ఎక్కువ లేకపోవడం రెండో ఎక్స్‌రేలో చూడొచ్చు) ఉన్నది.
ఊపిరితిత్తులలో చిన్న రంధ్రాలు ఉంటాయి. కరోనా రోగుల ఊపిరితిత్తుల్లో నీరు చేరిన కారణంగా ఈ రంధ్రాలకు ఆక్సిజన్ సరిగా చేరదు. ఫలితంగా దగ్గు, శ్వాస సరిగా తీసుకోలేకపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి. టీకాలు తీసుకొని రోగుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండడంతో పాటు ఆక్సిజన్, లేదంటే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సలు అందించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని, అదే టీకాలు తీసుకున్న వారికి వెంటిలేటర్ అవసరం తక్కువగా ఉంటుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Women’s Hokey team : మహిళల హాకీ టీంకు సూరత్ వజ్రాల వ్యాపారి బంఫర్ ఆఫర్
Tokyo Olympics : 41 ఏళ్ల నిరీక్షణకు తెర.. మెన్స్ హాకీలో భారత్‌కు కాంస్య పతకం
రూ.686 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
Pulichintala : ఊడిన పులిచింతల డ్యామ్ గేట్.. నీరంతా వృథా
Covid-19 : దేశంలో కొత్తగా 42,982 కరోనా కేసులు
Puri Jagannath Temple : భక్తులకు 16 నుంచి పూరీ జగన్నాథుడి దర్శనం
IED Blast in Chhattisgarh : ఐఈడీని పేల్చిన మావోలు.. 12 మందికి గాయాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

