సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏమిటి? ఈ సమయంలో పెండ్లిళ్లు చేయకూడదా?
Makar Sankranti | సంక్రాంతి నిలబెట్టడం అంటే ఏమిటి? ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదా?
– మహిజ, వరంగల్

సంక్రాంతి పండుగ సౌరమానానికి సంబంధించింది. సాధారణంగా అన్ని పండుగలు చాంద్రమానాన్ని అనుసరించి.. అంటే తిథి ప్రధానంగా చేసుకుంటారు. సంక్రాంతి మాత్రం సూర్య గమనం ఆధారంగా జరుపుకొంటారు. సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి మారడాన్ని సంక్రమణం అంటారు. సూర్యుడు ధనూరాశి నుంచి మకరంలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. ఆ రోజు నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది. మనకది పర్వదినం. అందుకే భారతీయులు సంక్రాంతిని పుణ్యకాలంగా భావిస్తారు.
సూర్యుడు ధనూరాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి మకరంలోకి వెళ్లే వరకు ఉన్న కాలాన్ని ధనుర్మాసంగా పరిగణిస్తారు. దీనిని తెలంగాణలో మార్గళి అనీ, గద్దె నిలబెట్టడం అని అంటారు. సంక్రాంతి నిలబెట్టడం అన్నా ఇదే. ధనుర్మాసంతోపాటు సంక్రాంతి పండుగనూ పీడ తొలగించే పుణ్యకాలంగా భావిస్తారు. శూన్య మాసమైన పుష్యంతో కూడుకున్న ధనుర్మాసంలో శుభ ముహూర్తాలు ఉండవు. వివాహాది శుభకార్యాలు చేయరు. ధనుర్మాసంలో మార్గశిరం ఉన్నట్లయితే శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ సమయంలో శుభకార్యాలు చేయకపోవడం వెనుక మరో వివరణ కూడా ఉంది. ధనుర్మాసంలో చలి తీవ్రత అధికంగా ఉంటుంది. యాసంగి పొలం పనులు కూడా జోరుమీద ఉంటాయి. ఈ సమయంలో శుభకార్యాల వల్ల వ్యవసాయం కుంటుపడే అవకాశం ఉంటుందని ధనుర్మాసంలో మార్గశిరం ఉన్నప్పటికీ పూర్వం శుభకార్యాలు చేసేవారు కాదు.
డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అయ్యప్ప దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు?
మొండి రోగాలను నయం చేసే వైద్యనాథుడి ఆలయం.. ఎక్కడో తెలుసా !
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
తండ్రీకొడుకులు ఇద్దరు ఒకే నక్షత్రంలో పుడితే దోషమా?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
- Tags
- Marriage
- sankranthi
- sankranti
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

