HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ టీకా సెర్వావాక్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ముందస్తు అర్హత గుర్తింపు లభించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న ఈ టీకా, యునైటెడ్ నేషన్స్ సంస్థలు కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం చేసింది. దేశంలో అభివృద్ధి చేసిన తొలి లింగభేదం లేని నాలుగు రకాల హెచ్‌పీవీ వైరస్‌లను లక్ష్యంగా చేసుకునే టీకాగా సెర్వావాక్ గుర్తింపు పొందింది.
HPV Vacchine | భారత్‌లో స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ టీకా సెర్వావాక్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ముందస్తు అర్హత గుర్తింపు లభించింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తున్న ఈ టీకా, యునైటెడ్ నేషన్స్ సంస్థలు కొనుగోలు చేసేందుకు మార్గం సుగమం చేసింది. దేశంలో అభివృద్ధి చేసిన తొలి లింగభేదం లేని నాలుగు రకాల హెచ్‌పీవీ వైరస్‌లను లక్ష్యంగా చేసుకునే టీకాగా సెర్వావాక్ గుర్తింపు పొందింది. హెచ్‌పీవీ వైరస్ వల్ల వచ్చే వ్యాధులను నివారించడంలో ఈ టీకా కీలక పాత్ర పోషిస్తుంది.
ఈ వయస్సుల వారు తీసుకోవచ్చు..
సెర్వావాక్ టీకాను 9 నుంచి 26 ఏళ్ల వయస్సున్న బాలికలు, బాలురు తీసుకోవచ్చు. భారత ఔషధ నియంత్రణ సంస్థ ఇప్పటికే ఈ టీకా వినియోగానికి అనుమతి ఇచ్చింది. హెచ్‌పీవీ వైరస్‌లోని 6, 11, 16, 18 రకాలను లక్ష్యంగా చేసుకుని ఈ టీకా పనిచేస్తుంది. వీటిలో 16, 18 రకాల వైరస్లు మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌తోపాటు ఇతర కొన్ని క్యాన్సర్లకు కారణమయ్యే అధిక ప్రమాదకర రకాలు. 6, 11 రకాల వైరస్లు జననాంగాలపై మొటిమలు ఏర్పడడానికి కారణమవుతాయి. ఈ టీకా ద్వారా మహిళల్లో గర్భాశయ ముఖద్వార, యోని, బాహ్య జననాంగాలు, మలద్వార క్యాన్సర్ల ముప్పును తగ్గించడంతోపాటు, పురుషుల్లో మలద్వార క్యాన్సర్, జననాంగాల మొటిమలను నివారించేందుకు సహాయపడుతుంది.
వయస్సును బట్టి మారే డోస్..
ఈ టీకా మోతాదులు వయస్సును బట్టి మారుతాయి. 9 నుంచి 14 ఏళ్ల వయసున్న వారికి రెండు మోతాదులు ఇవ్వాల్సి ఉంటుంది. మొదటి మోతాదు తీసుకున్న ఆరు నెలల తర్వాత రెండో మోతాదు ఇస్తారు. 15 నుంచి 26 ఏళ్ల వయసున్న వారికి మూడు మోతాదులు అవసరం. మొదటి మోతాదు తీసుకున్న రెండు నెలల తర్వాత రెండోది, ఆరు నెలల తర్వాత మూడోది ఇవ్వాల్సి ఉంటుంది. టీకా తీసుకునే ముందు వైద్యుల సలహా మేరకు సరైన మోతాదుల షెడ్యూల్‌ను అనుసరించడం అవసరం.
పురుషుల ఆరోగ్యానికి కూడా..
హెచ్‌పీవీ వైరస్ వల్ల వచ్చే వ్యాధులను నివారించేందుకు సెర్వావాక్ ఉపయోగపడడంతో, మహిళలతో పాటు పురుషుల ఆరోగ్య పరిరక్షణలోనూ దీనికి ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌కు కారణమయ్యే వైరస్ రకాల నుంచి రక్షణ కల్పించడంలో హెచ్‌పీవీ టీకాలు కీలకమైనవి. సెర్వావాక్కు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు అర్హత గుర్తింపు లభించడం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఈ టీకా అందుబాటును పెంచే అవకాశం ఏర్పడింది. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు జీవసంబంధ ఉత్పత్తులు, టీకాల విభాగంలో లభించిన 32వ ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందస్తు అర్హత గుర్తింపు ఇదని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HPV Vacchine | భారత హెచ్‌పీవీ టీకాకు డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు.. ఏయే వయస్సుల వారికి అంటే..
బేతవోలులో గుండెపోటుతో వ్యక్తి మృతి
Rashmika | 400 కుటుంబాలకు రష్మిక మందన్న సాయం.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’తో ఆకలిని తీర్చే ప్రయత్నం!
Navaratri Brahmotsavams | వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. సింహ వాహనంపై యోగ నరసింహుని దర్శనం
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

