నీరు తక్కువ తాగడం వల్లనో, పెరుగుతున్న మానసిక ఒత్తిడి వల్లనో ప్రతిఒక్కరూ తమ జీవిత కాలంలో ఏదో ఒక దశలో అల్సర్‌కు గురవడం సహజమే. అందుకనే విద్యార్థుల్లో పరీక్షలప్పుడు ఎక్కువగా నోటిపూతను గమనిస్తూ ఉంటాం. సాధారణంగా మూడు, నాలుగు రోజుల్లో తగ్గిపోయే అల్సర్లు.. అంతకంటే ఎక్కువగా ఉండి, తరుచుగా బాధిస్తూ ఉంటే ఎవ్వరినైనా అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. నోటి పూతతోపాటు, పెప్టిక్ అల్సర్లు, గ్యాస్ట్రిక్ అల్సర్లు, ఈసోఫీగల్ (అన్నవాహిక) అల్సర్లు, కదలలేని పరిస్థితుల్లో మంచానికే పరిమితమైనప్పుడు ఏర్పడే పుండ్లు, సిఫిలిస్, హెర్పిస్ వంటి STDల వల్ల, ఈస్పీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల జెనిటల్ మర్మావయవాలలో అల్సర్లు, డయాబెటిక్స్‌లో, కాళ్లలో వచ్చే న్యూరోపతిక్ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.
జీర్ణవ్యవస్థకు సంబధించిన అల్సర్లు, పెప్టిక్ అల్సర్లు ఎక్కువగా చూస్తూంటాం. చిన్నపేగు మొదట్లో ఉండే ఈ అల్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటినే ‘డుయోడినల్ అల్సర్లు’ అనికూడా అంటారు. జీర్ణవ్యవస్థలో ఎక్కువగా కనిపించే ఈ పూత 4% వరకు క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. జీర్ణాశయంలో వచ్చే అల్సర్లను ‘గ్యాస్ట్రిక్ అల్సర్లు’ అంటారు. పెప్టిక్ అల్సర్ల కంటే ఇవి తక్కువగా కనిపించినా.. గ్యాస్ట్రిక్ (Gastriccllars) అల్సర్లు, క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఎక్కువ. అన్నవాహికలో అల్సర్లు చాలా అరుదుగా కనిపిస్తాయి. నోటిపూతకు స్ట్రెస్, విటిమిన్స్ లోపం, విటమిన్ బి లోపం ప్రధాన కారణాలైతే.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన మిగతా అల్సర్లకు హెలికోబాక్టరీ పైలోరి (H. Pylori) అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ప్రధాన కారణం.
1980 వరకు అల్సర్లకు మసాలా ఆహారం, కారం, ఒత్తిడి, ధూమపానం.. పొట్ట, పేగులకు సంబంధించిన పూతకు కారణాలు అనుకునేవారు. దాదాపు వంద సంవత్సరాల వరకు అల్సర్లకు కారణాలు అవే అనుకొని, వీలైనంతగా వాటికి దూరం ఉండమని సలహాలు ఇచ్చేవారు. 1982లో టారీమార్షల్, రాబిన్ వారెన్ అనే ఇద్దరు డాక్టర్లు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అల్సర్లకు కారణం.. హెలికోబాక్టరీ పైలోరి (H. Pylori) అనే బ్యాక్టీరియానేనని కనుక్కొన్నారు. దీనికి వారు నోబెల్ బహుమతి కూడా అందుకున్నారు. జనాభాలో 90% మంది ఎప్పుడో ఒకప్పుడు ఈ బ్యాక్టీరియాకు గురవుతూనే ఉంటారు. కానీ ఒత్తిడి, ఎసిడిటీ, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి కారణాల వల్లనో, లేక వారి శరీరతత్వాన్ని బట్టి జీర్ణవ్యవస్థ లైనింగ్ దెబ్బతిన్నప్పుడు ఈ బ్యాక్టీరియా వల్ల అల్సర్లు ఏర్పడుతాయి. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకునేవారు ఈ బ్యాక్టీరియాకు గురయ్యే ప్రమాదం ఉంది. జీర్ణవ్యవస్థ అల్సర్లు ఉంటే కడుపులో నొప్పితోపాటు…
1. ఆకలి తగ్గటం, ఎసిడిటి, 2. వికారం, ఎక్కిళ్లు, త్రేన్పులు 3. రక్తపు వాంతులు, మలంతో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ లక్షణాలు అల్సర్ల స్టేజ్ మీద ఆధారపడి ఉంటాయి. మొదటి దశలో కడుపులో మంటగా ఉండటం, కొంచెం సేపు తగ్గి, కొద్దిసేపటికి మళ్లీ కడుపులో ఇబ్బందిగా ఉండటం జరుగవచ్చు. యాంటాసిడ్ తీసుకున్నప్పుడు కొంచెం ఉపశమనం కనిపించవచ్చు. రెండు వారాలు యాంటి బయాటిక్స్ RKP PPL వంటి మందులు తీసుకొంటే, ఈ అల్సర్లు పూర్తిగా నయం అవుతాయి.దాదాపు గ్యాస్ట్రిక్ అల్సర్ల లాగానే పొట్టకు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలూ ఉంటాయి. స్టమక్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం కూడా దీర్ఘకాలికంగా ఉన్న అల్సర్లే. అందుకనే ఒకసారి అల్సర్ వచ్చి తగ్గినవారు రెండోసారి అలాంటి లక్షణాలు కన్పించినా అల్సర్‌కు వాడిన మందులు వాడి, తర్వాత తగ్గడం లేదని డాక్టర్‌ను సంప్రదిస్తుంటారు. అందుకనే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఎండోస్కోపి, బయాప్సీ పరీక్షలు చేసి అనుమానంగా ఉంటే CT స్కాన్, అల్ట్రాసౌండ్ ఎండోస్కోపి పరీక్షలు చేసి స్టేజ్‌ను నిర్ధారిస్తారు.
పొట్టకు సంబంధించిన క్యాన్సర్లకు చికిత్స కూడా కణితి వచ్చిన ప్రదేశం, స్టేజ్, వయస్సు, ఇతర ఆరోగ్య విషయాలపై ఆధారపడి ఉంటాయి. పొట్టలో కణితి వచ్చిన ప్రదేశాన్ని బట్టి పొట్టలో కొంత భాగాన్ని తీసివేసి, గ్యోస్ట్రిక్టవి లేక పొట్టను మొత్తంగా తీసివేయడంతోపాటు చుట్టూ ఉన్న లింఫ్నాడ్సో, చిన్న పేగుల్లో కొంత భాగాన్ని, అన్నవాహికలో కొంత భాగాన్ని తీసివేస్తారు. క్యాన్సర్‌ను కొంచెం లేటుగా గుర్తించినప్పుడు పొట్ట మొత్తాన్నీ తీసివేసి, అన్నవాహికను చిన్న పేగులతో కలిపి వేస్తారు. సర్జరీ తర్వాత ఆహారం తీసుకొలేక పోవడం, వాంతులు, వికారం, మలబద్ధకం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సర్జరీకి ముందు కీమో, రేడియోథెరపీ చేసినా.. లేక సర్జరీ తర్వాత కీమోథెరపీ, రేడియోథెరపీ చేసినా ఈ లక్షణాలు ఉంటాయి. పొట్టకు సంబంధించిన క్యాన్సర్ల పట్ల మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
డాక్టర్ మోహనవంశీ చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్ 98480 11421