హైదరాబాద్: ఇటీవల విరాట్ కోహ్లీ సరైన ఫామ్‌లో లేని విషయం తెలిసిందే. భారీ స్కోర్లు చేయలేకపోతున్న కోహ్లీ ఆటతీరు అతని అభిమానుల్ని కలిచివేస్తోంది. ఇక బడా ప్లేయర్లు కూడా కోహ్లీ ఏం చేస్తే బాగుంటుందో సలహాలు ఇస్తూనే ఉన్నారు. అయితే ఇవాళ తన ట్విట్టర్లో విరాట్ కోహ్లీ ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు చేశారు. ప్రేరణాత్మక సందేశం ఉన్న ఓ ఫోటో వద్ద దిగిన ఫోటోను అతను ట్వీట్ చేశారు. ఈ దృష్టికోణంలో చూడండి అన్న సంకేతం వచ్చేలా విరాట్ ఆ ఫోటోకు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఓ ఆర్టిస్ట్ వేసిన పక్షి రెక్కల బొమ్మ వద్ద విరాట్ ఫోటో దిగాడు. అయితే ఆ కళాత్మక పేంటింగ్కు ఓ మెసేజ్ కూడా ఉంది. వాట్ ఇఫ్ ఐ ఫాల్.. ఓహ్ బట్ మై డార్లింగ్, వాట్ ఇఫ్ యూ ఫ్లయ్ అని ఆ ఆర్ట్ వర్క్ వద్ద రాసి ఉంది. నేను కింద పడితే ఏమౌతుంది.. మై డార్లింగ్ .. నువ్వు ఎగురుతున్నావ్ కదా అన్న సందేశాన్ని ఆర్టిస్ట్ తన వర్క్‌లో చిత్రీకరించాడు. అయితే కోహ్లీ ఆ ఫోటోను ఈ టైమ్‌లో ట్వీట్ చేయడం తనలో దాగిన విభిన్న కోణాన్ని బయటపెట్టింది.
Perspective pic.twitter.com/yrNZ9NVePf
— Virat Kohli (@imVkohli) July 16, 2022
ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగే మూడవ వన్డేలో కోహ్లీ ఆడనున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన అయిదో టెస్టులో కోహ్లీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 11, సెకండ్ ఇన్నింగ్స్‌లో 20 రన్స్ చేశాడు. ఇక రెండు టీ20ల్లో 1, 11 రన్స్ చేశాడు. రెండో వన్డేలో కేవలం 16 రన్స్ చేశాడు.