1. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, జీడీపీ వృద్ధిలో ఏదీ కీలక పాత్ర పోషిస్తుంది?
1) మైనింగ్ 2) విద్యుత్ పరిశ్రమ
3) సిమెంట్ పరిశ్రమ 4) ఉక్కు పరిశ్రమ
2. రాష్ట్రంలో ఏ ప్రాంతాల్లోని భూభాగంలో
అపారమైన బొగ్గు నిక్షేపాలతో పాటు సహజ వనరులు ఉన్నాయి?
1) గోదావరి పరీవాహక ప్రాంతం
2) ప్రాణహిత పరీవాహక ప్రాంతం
3) గోండ్వానా 4) పైవన్నీ
3. రాష్ట్రంలో ఏ జిల్లాలో ఇనుము ధాతువు ఆస్బెస్టాస్ ఎక్కువగా లభ్యమవుతుంది?
1) మహబూబాబాద్
2) జయశంకర్ భూపాలపల్లి
3) జగిత్యాల 4) పైవన్నీ
4. బైరటీస్ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతుంది?
1) మహబూబ్‌నగర్ 2) పెద్దపల్లి
3) జోగులాంబ గద్వాల 4) రంగారెడ్డి
5. రాష్ట్రంలో సున్నపురాయి ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది?
1) ఆదిలాబాద్, పెద్దపల్లి
2) మహబూబాబాద్, మంచిర్యాల
3) వికారాబాద్, నల్లగొండ 4) పైవన్నీ
6. రాష్ట్రంలో రాగి నిక్షేపాలు ఎక్కువగాఏ జిల్లాలో లభిస్తున్నాయి?
1) మేడ్చల్ మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల
2) నల్లగొండ, రంగారెడ్డి
3) వరంగల్ 4) భద్రాద్రి కొత్తగూడెం
7. రాష్ట్రంలో మాంగనీస్ ఏ జిల్లా నుంచి ఎక్కువగా లభ్యమవుతుంది?
1) ఆదిలాబాద్ 2) వికారాబాద్
3) నిర్మల్ 4) సూర్యాపేట
8. రాష్ట్రంలో ఇనుప ఖనిజ నిల్వలు ఎక్కువగా ఏ జిల్లాలో ఉన్నాయి?
1) నిజామాబాద్ 2) ఖమ్మం
3) మహబూబాబాద్ 4) భద్రాద్రి కొత్తగూడెం
9. 2020-21 సంవత్సరంలో గనులు,ఖనిజాల ద్వారా అత్యధిక ఆదాయం లభించిన మొదటి మూడు జిల్లాలు ఏవి?
1) మంచిర్యాల, ఆదిలాబాద్, నల్లగొండ
2) సిద్దిపేట, కరీంనగర్, సూర్యాపేట
3) జోగులాంబ గద్వాల, వనపర్తి,
కుమ్రంభీం ఆసిఫాబాద్
4) ఖమ్మం, వికారాబాద్, నాగర్‌కర్నూల్
10. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వివిధ ఖనిజాల్లో దేని విలువ అత్యధికంగా ఉంది?
1) బొగ్గు 2) సున్నపురాయి
3) లాటరైట్ 4) స్టోవింగ్ సాండ్
11. 2019-20 సంవత్సరంలో ఇసుక అమ్మకం ద్వారా రాష్ర్టానికి ఎంత ఆదాయం వచ్చింది?
1) రూ.506 కోట్లు 2) రూ.706 కోట్లు
3) రూ.806 కోట్లు 4) రూ.608 కోట్లు
12. రాష్ట్రంలో బంగారు గనులు ఉన్న ప్రాంతాలు ఏవి?
1) ఆత్మకూరు 2) గద్వాల శిలబెల్ట్
3) మంగంపేట 4) పైవన్నీ
13. బయ్యారం ఇనుప గనులు ఏ జిల్లాలో ఉన్నాయి?
1) మహబూబాబాద్ 2) నిజామాబాద్
3) ఖమ్మం 4) భద్రాద్రి కొత్తగూడెం
14. రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో ఏ రకం గ్రానైట్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి?
1) టాన్బ్రౌన్ 2) మాపెల్రెడ్
3) కాఫీబ్రౌన్ 4) పైవన్నీ
15. కింది వాటిలో బొగ్గులోని రకాలు ఏవి?
1) ఆంత్రసైట్ 2) బిట్యుమినస్
3) లిగ్నైట్ 4) సెమీ బిట్యుమినన్
16. కింది వాటిలో నల్లటి రంగులో గట్టిగా ఉండి పొగరాకుండా మెల్లగా మండుతూ వేడిని ఇచ్చే బొగ్గు ఏది?
1) ఆంత్రసైట్ 2) బిట్యుమినన్
3) లిగ్నైట్ 4) సెమీ బిట్యుమినన్
17. కింది వాటిలో ఉన్నత శ్రేణి బొగ్గు ఏది?
1) లిగ్నైట్ 2) ఆంత్రసైట్
3) బిట్యుమినస్ 4) లిగ్నైట్
18. కింది వాటిలో తక్కువ శ్రేణికి చెందిన బొగ్గు ఏది?
1) ఆంత్రసైట్ 2) బిట్యుమినస్
3) సెమీ బిట్యుమినస్ 4) లిగ్నైట్
19. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో సెమీ బిట్యుమినస్ రకానికి చెందిన బొగ్గు లభిస్తుంది?
1) తాండూర్ 2) సింగరేణి
3) కొత్తగూడెం 4) పైవన్నీ
20. ఏ రకం బొగ్గులో రాయి తక్కువగా ఉండి బూడిద ఎక్కువగా ఉంటుంది?
1) ఆంత్రసైట్ 2) టాన్ బ్రౌన్
3) సెమీ బిట్యుమినస్ 4) లిగ్నైట్
21. సెమీ బిట్యుమినస్ బొగ్గులో కార్బన్ ఎంత శాతం ఉంటుంది?
1) 61-62శాతం 2) 71-72 శాతం
3) 81-82 శాతం 4) 91-92శాతం
22. పరిశ్రమల్లో నీటి ఆవిరిని తయారు చేయడానికి విరివిగా దేనిని ఉపయోగిస్తారు?
1) ఆంత్రసైట్ బొగ్గు
2) లిగ్నైట్
3) టాన్బ్రౌన్ బొగ్గు
4) సెమీ బిట్యుమినస్ బొగ్గు
23. ఇనుప ఖనిజాన్ని కరిగించడానికి తక్కువగా కింది ఏ బొగ్గును ఉపయోగిస్తారు?
1) టాన్బ్రౌన్ 2) సెమీ బిట్యుమినన్
3) ఆంత్రసైట్ 4) లిగ్నైట్
24. సున్నపురాయిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
1) సూర్యాపేట 2) కుమ్రంభీం ఆసిఫాబాద్
3) నిర్మల్ 4) కరీంనగర్
25. ఆదిలాబాద్ జిల్లాలో చాలా తక్కువ మోతాదులో పెన్‌గంగ లోపల సన్నని పొరలుగా కింది ఏ ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి?
1) మాంగనీస్ 2) ఇనుము
3) బంగారం 4) డోలమైట్
26. రాష్ట్రంలో ఏ జిల్లాల్లో బిల్డింగ్ రాళ్లను మెరుగుపరిచే కేంద్రాలు ఉన్నాయి?
1) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం
2) రంగారెడ్డి, కొత్తగూడెం
3) వరంగల్ జయశంకర్ భూపాలపల్లి
4) పైవన్నీ
27. దక్షిణ భారతదేశంలో బొగ్గు నిల్వలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1) కేరళ 2) ఆంధ్రపదేశ్
3) తెలంగాణ 4) తమిళనాడు
28. నల్లగొండ జిల్లాలోని కింది ఏ ప్రాంతంలో నాణ్యమైన స్ఫటిక నిక్షేపాలు ఉన్నాయి?
1) నిడమనూరు 2) దామరచర్ల
3) చర్కొండ 4) పైవన్నీ
29. నాణ్యత గల సియొటైట్ నిక్షేపాలు కింది ఏ జిల్లాలో ఉన్నాయి?
1) ఖమ్మం 2) జగిత్యాల
3) మహబూబాబాద్ 4) సూర్యాపేట
30. ఖనిజాలను వెలికితీయడం వల్ల పర్యావరణంపై ఏ కాలుష్యం ప్రభావం చూపుతుంది?
1) వాయు కాలుష్యం
2) ఉపరితల జల కాలుష్యం
3) భూగర్భ జల కాలుష్యం
4) పైవన్నీ