హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో శుక్రవారం వెల్నెస్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవనగర్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు. కండ్లు, దంతాల ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఎత్తుకు తగిన బరువు(బీఎంఐ) ఉన్నారో లేదో పరిశీలించారు. థర్మోమీటర్, పల్స్ ఆక్సీమీటర్‌తో ప్రా థమిక పరీక్షలు నిర్వహించారు. చేతులు కడుక్కోవ డం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఏరోబిక్, వామప్ ఎక్సర్సైజ్లు చేయించి శరీర సామర్థ్యాన్ని పరీక్షించారు. విద్యార్థుల్లో చాలామంది పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు గుర్తించామని నిర్వాహకులు చెప్పారు. ఆ సమస్య నుంచి బయటపడేందుకు సహాయం అందించాలని నిర్ణయించామని అన్నారు. ఈ సందర్భంగా ఓక్రిడ్జ్ విద్యార్థులు సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.