రోజువారీ వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల ఆదరాభిమానాలు పొందుతారు. ఖర్చులు పెరుగుతాయి. ఆలోచించి పనులు చేయడం వల్ల కార్యసాఫల్యం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కుటుంబంతో ఆనందంగా కాలం గడుపుతారు. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. సూర్యోపాసన మేలుచేస్తుంది.
ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. పట్టుదలతో బాధ్యతలు పూర్తిచేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు. వ్యాపారులకు మంచి సమయం. కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. రాబడికి తగ్గట్టే ఖర్చులు ఉంటాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నిరుద్యోగులకు తాత్కాలిక ఊరట లభిస్తుంది. శివాలయాన్ని సందర్శించండి.
తలపెట్టిన పనులు నిర్ణీత సమయంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. వారాంతంలో ఒక వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. రుణబాధలు కొంతవరకు తీరుతాయి. వ్యాపారులకు మంచి సమయం. భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. రామాలయాన్ని సందర్శించండి.
గతంతో పోలిస్తే ఈ వారం మెరుగైన ఫలితాలు పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థానచలన సూచన ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి మార్గాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారులకు ఓ మోస్తరు అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనువైన సమయం కాదు. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.
పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య విషయాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. సంతృప్తిగా ఉంటారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. అధికారుల ఆదరణ ఉంటుంది. మిత్రుల రాకతో ఇల్లు సందడిగా మారుతుంది. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించండి.
వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలపై మనసు నిలుపుతారు. ఆస్తి తగాదాలు ఏర్పడవచ్చు. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. కాలయాపన చేయకుండా పనులపై మనసు నిలపడం మంచిది. వివాహాది శుభకార్యాల విషయంలో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. తీర్థయాత్రలు చేపడతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. వ్యవసాయదారులకు రాబడి పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య మంచి అవగాహన ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరిగినప్పటికీ, శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. వారాంతంలో ఒక శుభవార్త వింటారు. శివాలయాన్ని సందర్శించండి.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల రాకతో సంతృప్తిగా ఉంటారు. ఉద్యోగులకు బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. సాహితీవేత్తలకు, కళాకారులకు అవకాశాలు వస్తాయి. సాహసంతో నిర్ణయాలు తీసుకుంటారు. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.
ఆదాయ మార్గాలపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆత్మీయుల సహకారంతో పనులు నెరవేరుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబపెద్దల సహకారంతో కీలక విషయంలో ఒక పరిష్కారం దొరుకుతుంది. సహోద్యోగులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. అధికారుల మన్ననలు అందుకుంటారు. వ్యాపారులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆదాయం పెరుగుతుంది. పెద్దల సహకారం లభిస్తుంది. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వృత్తిపరంగా గుర్తింపు లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రుణబాధలు తొలగిపోతాయి. నరసింహస్వామి ఆరాధన మేలుచేస్తుంది.
అనవసరమైన కాలయాపన, ఖర్చులు ఉండవచ్చు. ప్రారంభించిన పనులలో శ్రమ అధికంగా ఉంటుంది. ఇంట్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటారు. సహోద్యోగులు, అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. సంయమనంతో పనులు చేసుకోవడం అవసరం. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆదాయమార్గాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వీరభద్రుణ్ని ఆరాధించండి.
ఉత్సాహంగా ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. శుభకార్యాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. అందుకు తగ్గ ఆదాయమూ ఉంటుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విద్యార్థులకు అనుకూలం. వ్యాపారులు న్యాయ పరమైన సమస్యలను అధిగమిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇష్టదేవత ఆరాధన మేలుచేస్తుంది.