హైదరాబాద్ : వాతావరణ శాఖ ( Weather Department ) తెలుగు రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు ( Alert ) జారీ చేసింది . వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిం చింది. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు ( High Temperatures ) నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.
సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని, వడగాలులు వీచే అవకాశముందని ,ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొదని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత కారణంగా ఆదివారం 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. సోమవారం ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు .