అమరావతి : రతనాల సీమగా ఉన్న రాయలసీమ(Rayalaseema) ను గ్రీన్ ఎనర్జీ హబ్(Green Energy Hub) గా మారుస్తామని ఏపీ సీఎం చంద్రబాబు (Chandra babu) వెల్లడించారు. కర్నూలు జిల్లా పుచ్చకాయకొండ గ్రామంలో మంగళవారం ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పలువురు లబ్దిదారుల ఇంటికి వెళ్లి పించన్లను పంపిణీ చేశారు. కర్నూలు నుంచి బళ్లారికి జాతీయ రహదారి తెస్తామని హామీ ఇచ్చారు.
ఓర్వకల్లులో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నా. కర్నూలులోహైకోర్టు బెంచ్(High Court Bench)ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం 22ఏ పేరుతో భూములన్నీ దోచుకున్నారని, పాసు పుస్తకాల మీద కూడా వారి బొమ్మలు వేసుకున్నారని మండిపడ్డారు. అందుకే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని, భూములపై .
త్వరలోనే సర్వే చేస్తామని, జీఎఎస్తో మీ భూములు మీకు అప్పగిస్తామని వెల్లడించారు.పింఛన్ల పంపిణీని శాశ్వతంగా కొనసాగిస్తామని బాబు వెల్లడించారు. జీతాల గురించి ఇక నుంచి ఎవరూ ఆందోళన చెందవదని కోరారు. రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలనది నా లక్ష్యమని పేర్కొన్నారు.