YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
YS Jagan | స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై సుప్రీం కోర్టుకు వెళతామని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి వెల్లడించారు.
అమరావతి : స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నెలకొన్న పరిస్థితులపై సుప్రీం కోర్టు ( Supreme Court ) కు వెళతామని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( Y.S. Jagan ) వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆదివారం గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazeer ) కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికలను సజావుగా జరిపించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షాలు నామినేషన్ వేయకుండా పోలీసులు, అధికారుల అండతో అక్రమంగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అరాచక చర్యల వల్ల అనేక చోట్ల వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని విమర్శించారు. వైసీపీ అభ్యర్థుల నుంచి నామినేషన్ల పత్రాలను లాక్కొని చించివేశారని వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో జరుగు తున్న మున్సిపల్ ఎన్నికల్లో పరిస్థితి ఇలా ఉంటే ఇక గ్రామ స్థాయిలో జరుగనున్న పంచా యతీ ఎన్నికల్లో మరింత దారుణ పరిస్థితులు ఉంటాయమోనని అనుమానం వ్యక్తం చేశారు.
ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎంపీలపై దాడుల గురించి గవర్నర్కు విన్నవించామని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల అధికారి చంద్రబాబు నియమించిన వ్యక్తేనని ఆరోపించారు. ప్రజాస్వామ్యం దిగజారినపుడే కాక్రోచ్లాంటి పార్టీలు పుట్టుకొస్తాయని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

