MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
MLA Sudheer Reddy | మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి హైదరాబాద్‌కు పంపింగ్ చేసుకుంటే సిస్టమ్ రెడీగా కేవలం బటన్ ఒత్తితే హైదరాబాద్‌కు నీళ్లొస్తయని చెప్పినం. సంవత్సరానికి 10 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు సరిపోతయి. మొత్తం హైదరాబాద్ నీటి సమస్య తీరుతదని చెప్పాం. కానీ ఈ రోజుకు కూడా అది అసలు వాడుకోలేదని ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు.
MLA Sudheer Reddy | పోయిన జూన్ నుంచే మాకు అతి తక్కువ నీళ్లొస్తున్నయ్.. మాకు సమస్య అవుతుంది.. ఏం చేద్దాం సార్ అని మాకు హైదరాబాద్‌లో మా ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. కన్నెపల్లి పంప్ హౌసును బీఆర్ఎస్ నాయకుల బృందం పరిశీలించింది. ఇప్పటికైనా కన్నెపల్లి మోటర్లు ఆన్ చేసి గ్రేటర్ హైదరాబాద్ తాగునీటి సమస్య, రైతుల సాగునీటి సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడే ఇట్ల తక్కువుంటే ఎట్లా సార్ అని నీళ్ల సమస్యపై ప్రజలు మా దగ్గరకు ఎన్నోసార్లు వచ్చారు. అప్పుడే మేం వెళ్లి వాటర్ వర్క్స్ ఎండీని కలిసి ఇప్పుడినుంచే ఇలాంటి సమస్య వస్తే రాబోయే ఎండాకాలాన్ని మీరు ఏ విధంగా టాకిల్ చేస్తారు… దానికేమైనా ప్రణాళిక మీ దగ్గరుందా..? అని అడిగితే.. ఏం ప్రాబ్లమ్ లేదు.. అంతా బాగా చేస్తం. కొన్ని రోజులు ఇబ్బంది అయితదని చెప్పిర్రు. కానీ ఇబ్బంది కాకపోవడంతో ఆ రోజు జలమండలిని ముట్టడించి వాళ్లకు ఆరోజు సూచనలు చేశాం. మీరు మేడిగడ్డ నుంచి కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి హైదరాబాద్‌కు పంపింగ్ చేసుకుంటే సిస్టమ్ రెడీగా కేవలం బటన్ ఒత్తితే హైదరాబాద్‌కు నీళ్లొస్తయని చెప్పినం. సంవత్సరానికి 10 టీఎంసీల నీళ్లు హైదరాబాద్‌కు సరిపోతయి. మొత్తం హైదరాబాద్ నీటి సమస్య తీరుతదని చెప్పాం. కానీ ఈ రోజుకు కూడా అది అసలు వాడుకోలేదు.
కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేస్తే హైదరాబాద్‌కు నీళ్లు వచ్చేవి.. కానీ ఆన్ చేయలేదన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 17 మోటార్లు ఆన్ చేసి 2600 క్యూసెక్కుల నీటిని పంప్ చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదని స్పష్టం చేశారు. కన్నెపల్లి నుండి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే హైదరాబాద్‌కు తాగునీటి సమస్య, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య వచ్చేది కాదన్నారు. మేడిగడ్డ వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిన శబ్దం వచ్చిందని అధికారి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పటివరకు విచారణ జరపలేదు. కుట్రతో బాంబ్ పెట్టి మేడిగడ్డ పిల్లర్లు పగలగొట్టారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు.
ఇది కాళేశ్వరం కాదు.. కూలేశ్వరం అని లక్ష కోట్ల అవినీతి అయిందని అనేక రకాలుగా దీన్ని బద్నాం చేసి అధికారంలోకి వచ్చిన ఈ రేవంత్ రెడ్డి.. ఇన్ని అబద్దాలాడి నేను అధికారంలోకి వచ్చిన మళ్లీ అందులో నుంచే ప్రజలు నన్ను వెక్కిరిస్తరు.. ఈ బీఆర్ఎస్ పార్టీవాళ్లు నా వెనుక పడ్తరు.. కాబట్టి రాష్ట్రాన్ని ఎండబెడతం కానీ మేం మాత్రం ఇక్కడ నుంచి నీళ్లు తీసుకపోం.. అని ఒక కుట్రపూరిత నిర్ణయంతో రేవంత్ రెడ్డి ఇక్కడ అవకాశమున్నా కానీ.. నీళ్లు తీసుకోకపోవడమనేది దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.
జూన్ నెల నుండే హైదరాబాద్‌లో తక్కువ నీళ్లు వస్తున్నాయని వాటర్ వర్క్స్ ఎండీని కలిసి కంప్లైంట్ ఇచ్చాం
కొద్ది రోజుల్లో సరిచేస్తామని చెప్పి ఇప్పటివరకు పట్టించుకోలేదు
కన్నెపల్లి వద్ద మోటార్లు ఆన్ చేస్తే హైదరాబాద్‌కు నీళ్లు వచ్చేవి.. కానీ ఆన్ చేయలేదు
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 17 మోటార్లు ఆన్ చేసి 2600 క్యూసెక్కుల నీటిని పంప్ చేసే అవకాశం ఉన్నా వాడుకోలేదు
కన్నెపల్లి నుండి నీటిని లిఫ్ట్ చేసి ఉంటే హైదరాబాద్‌కు తాగునీటి సమస్య, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ఆయకట్టు కింద ఉన్న 20 లక్షల ఎకరాలకు సాగునీటి సమస్య వచ్చేది కాదు
మేడిగడ్డ వద్ద బాంబ్ బ్లాస్ట్ జరిగిన శబ్దం వచ్చిందని అధికారి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఇప్పటివరకు విచారణ జరపలేదు
కుట్రతో బాంబ్ పెట్టి మేడిగడ్డ పిల్లర్లు పగలగొట్టారనే అనుమానాలు ఉన్నాయి
– ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
— Telugu Scribe (@TeluguScribe) October 24, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

