Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
Kriti Sanon | బాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ మరియు లింగ వివక్షపై ప్రముఖ నటి కృతి సనన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Kriti Sanon Slams Trolls | బాలీవుడ్లో మహిళలపై జరుగుతున్న ట్రోలింగ్ మరియు లింగ వివక్షపై ప్రముఖ నటి కృతి సనన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీనా కపూర్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘వాట్ విమెన్ వాంట్’ షోలో పాల్గొన్న ఆమె, తన దుస్తులపై జరిగిన అనవసర రాద్ధాంతం గురించి ఓపెన్‌గా మాట్లాడారు. ఇటీవల ఒక ప్రకటనలో తాను ధరించిన డ్రెస్ జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడం, ఏకంగా ప్రైమ్‌టైమ్ న్యూస్ డిబేట్లు జరగడం తనను తీవ్రంగా షాక్‌కు గురిచేసిందని కృతి తెలిపారు. సాధారణంగా ఇలాంటి విమర్శలను తాను పట్టించుకోనప్పటికీ, మహిళలను చిన్న విషయాలకే టార్గెట్ చేయడం పెరిగిపోవడంతో స్పందించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని, ఇతరులకు ఆ హక్కు ఎవరిచ్చారని కృతి నిలదీశారు. లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, కాస్త బరువు పెరిగినా బాడీ షేమింగ్ చేయడం, అనవసరమైన కామెంట్లు విసరడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా నెగెటివిటీని తట్టుకోలేక కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసేయమని సోదరి సలహా ఇచ్చినా, ఎవరికీ భయపడి తాను వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు. కృతి ధైర్యవంతమైన వ్యాపార వైఖరిని కరీనా కపూర్ ఖాన్ పూర్తిగా సమర్ధించారు. చిన్నపాటి శారీరక మార్పులకు కూడా జనం ముందు వివరణ ఇచ్చుకోవాల్సిన దుస్థితి నేడు నెలకొందని ఆందోళన వ్యక్తం చేస్తూ, కృతి స్పందించిన తీరు ఎంతో అభినందనీయమని ప్రశంసించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
IND vs NZ | తిలక్ వర్మ హాఫ్ సెంచరీ.. ఉత్కంఠ పోరులో గెలిచిన టీమిండియా
IndiGo flight | ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. పార్కింగ్ బే వద్దకు ఫ్లైట్
Udta Teer Review | పాకిస్థాన్ ఏజెంట్ ఇండియా వస్తే.. ‘ఉడ్తా తీర్’ రివ్యూ.!
The Paradise | ఓటీటీలో నాని ‘ది ప్యారడైజ్’ సంచలనం.. 48 గంటల్లోనే రికార్డు స్థాయి వ్యూస్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

