‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి’
జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఒక్క దోమ అనేక ప్రమాదాలు అనే నినాదంతో..
అనంతగిరి, మే 16 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ ఫిరోజ్ మాట్లాడుతూ.. ఒక్క దోమ అనేక ప్రమాదాలు అనే నినాదంతో ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఏడీస్ ఈజిప్ట్ దోమ వల్ల వ్యాధి వస్తుందన్నారు. మన ఇంటి లోపల ఉండే పూల కుండీలు, కూలర్లు, మంచినీటి తొట్లు, కొబ్బరి బోండాలు, నిల్వ ఉన్న మంచి నీటి పరిసరాలలో స్థావరం ఏర్పాటు చేసుకుని జబ్బు బారిన పడిన వ్యక్తి నుండి వాహకాన్ని మోసుకొచ్చి కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందన్నారు. కావునా ఇంటి పరిసరాలలో వారానికి ఒకసారి నీరు నిల్వ లేకుండా డ్రై డే పాటించాలని సూచించారు. ఎవరికైనా జ్వరం బారిన పడినట్లయితే ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో రక్త పరీక్షలు నిర్వహించుకుని నిర్ధారణ అయితే మందులు వాడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ ఉపేందర్, సూపర్వైజర్ ఉమామహేశ్వరి, యాతాకుల మధుబాబు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

