హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): ప్రపంచవ్యాప్తంగా పొంచి ఉన్న పర్యావరణ మార్పులను సమష్టిగా ఎదుర్కొన్నప్పుడే మానవాళిని, వ్యవసాయ, ఉద్యాన రంగాలను కాపాడుకోగలమని భారత వా తావరణశాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర అన్నా రు. చిన్న, సన్నకారు రైతాంగంపై పర్యావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేయాల్సిన అవసరమున్నదని పేర్కొన్నారు.
శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విద్యాలయం, ఉద్యానశాఖ, నాబార్డ్, ఎర్త్ సైన్సెస్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అగ్రికల్చర్ వర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఉద్యానరంగంపై పర్యావరణ మార్పుల ప్రభావం అనే అంశంపై ములుగు ఉద్యాన వర్సిటీలో రెండ్రోజులపాటు నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వాతావరణ అంచనాలు 40నుంచి 50% మాత్రమే కచ్చితత్వంతో పనిచేస్తున్నాయని తెలిపారు. నిపుణులు రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు.