హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తె లంగాణ): ఉద్యోగుల రిటైర్మెంట్ వ యోపరిమితి పెంపు పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయానికి సంబంధించిన అంశమని, ఇలాంటి విషయాల్లో కోర్టులు జోక్యం చే సుకునే అవకాశం పరిమితమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే విధమైన బోధనా బాధ్యతలు నిర్వహిస్తున్నామనే కారణంతో ఇతర విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో సమానంగా రిటైర్మెంట్ వయోపరిమితిని పెంచాలన్న అభ్యర్థనను తోసిపుచ్చింది.
ఈవిధంగా కోరే హకు లేదని వ్యవసాయ, వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీ అధ్యాపకులకు తేల్చిచెప్పింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరిధిలోని వర్సిటీల అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం గతంలో జారీచేసిన జీవోను తమకూ వర్తింపజేయాలని కోరుతూ ఈ 3 వర్సిటీల అధ్యాపకులు దాఖలు చేసిన 13 పిటిషన్లను కొట్టివేసింది. ఈ మేరకు జస్టిస్ కే శరత్ ఇటీవల తీర్పు వెలువరించారు.