Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Religious Conversion | కేవలం వివాహం కోసం మతమార్పిడిని అంగీకరించలేమని పే ర్కొన్న బాంబే హైకోర్టు.. మతం మార్చుకునే వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రం ధ్రువీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది.
Religious Conversion | ముంబై, అక్టోబర్ 22: కేవలం వివాహం కోసం మతమార్పిడిని అంగీకరించలేమని పే ర్కొన్న బాంబే హైకోర్టు.. మతం మార్చుకునే వ్యక్తిగత స్వేచ్ఛను మాత్రం ధ్రువీకరిస్తున్నట్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మత మార్పిడి వ్యతిరేక చట్టం రా జ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.
థాణెకు చెందిన 70 ఏండ్ల ఇస్లామ్ మత బోధకుడు దాఖలు చేసిన ఈ పిటిషన్లో రాజ్యాంగంలో ని 25వ అధికరణం మతాన్ని ప్రచారం చేసుకునే స్వేచ్ఛకు హామీనిస్తుందని, అయితే ప్రభు త్వం తెచ్చిన చట్టం ఈ స్వేచ్ఛకు విఘాతం క లిగిస్తున్నదని పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ మహేశ్ సీ త్రిపాఠి, జస్టిస్ అద్వైత్ సేథ్నాలతో కూడిన ధర్మాసనం.. స మాజంలోని లౌకిక స్వభావాన్ని కాపాడటాని కి, బలవంతంగా జరిగే మత మార్పిడుల స మస్యలను పరిష్కరించడానికి ఈ చట్టాన్ని ఉ ద్దేశించినట్టు పేర్కొన్నది. ‘దేశంలోని లౌకిక స మాజాన్ని కాపాడటానికి మాత్రమే దీనిని ఉద్దేశించారు.
దేశంలోని ప్రతి పౌరుడికీ తన మతం నుంచి మారే హక్కు ఉంది. కేవలం వివా హం చేసుకునే ఉద్దేశంతోనే మతం మార్చుకోవడాన్ని అనుమతించం’ అని ధర్మాసనం పే ర్కొంది. ముఖ్యంగా పెండ్లికి ఒకటి రెండు రోజు ల ముందు మతాన్ని మార్చుకునే విధానాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. నిర్దిష్ట వాస్తవ వా దనలు లేనందున పిటిషన్‌ను స్వీకరించడాని కి కోర్టు నిరాకరించింది. తగిన సహాయక వా స్తవాలతో కొత్త వాదనను దాఖలు చేయడాని కి పిటిషనర్‌కు స్వేచ్ఛను మంజూరు చేసింది. దీంతో కేసును ఉపసంహరించుకోవడానికి అంగీకరించిన పిటిషనర్ త్వరలో తాజా పిటిషన్‌ను దాఖలు చేస్తానని కోర్టుకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
Gang Rape | గర్భిణి బాలికపై గ్యాంగ్ రేప్.. దాడి సమయంలో ప్రసవం
82% జీవోలు రహస్యం.. కాంగ్రెస్ పాలనలో మితిమీరిన గోప్యత
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

