కరీంనగర్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్పై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని, తమకు పేసేల్ వర్తింపజేస్తూ త్వరలోనే జీవో విడు దల చేస్తారని ఆశిస్తున్నామని తెలంగాణ వీఆర్ఏల కేంద్ర సంఘం పేర్కొంది. కొన్ని సంఘాలు సమ్మె కు వెళ్తున్నట్టు వస్తున్న వార్తలతో తమకు సంబంధం లేదని, తాము సమ్మెలో పాల్గొనడం లేదని ఆ సం ఘం స్పష్టంచేసింది. ఈ మేరకు హైదరాబాద్లో జరిగిన ఈ సంఘం సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్టు కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రొడ్డ రమేశ్ స్పష్టంచేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్ర భుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు నిర్వహించవద్దని నిర్ణయించినట్టు చెప్పారు. రాష్ట్రం లో కొన్ని సంఘాలు, ప్రత్యేకించి సీఐటీయూ లాంటి రాజకీయ శక్తులు వీఆర్ఏలలోని డైరెక్ట్ రిక్రూట్ అయిన వారిని, కొంతమంది వారసత్వ వీఆర్ఏల సంఘానికి సంబంధించిన వారిని ప్ర లోభపెట్టి జేఏసీని సృష్టించి సమ్మెకు దిగుతున్నట్టు ప్రచారం చేయడాన్ని తమ సంఘం తప్పుపట్టింద న్నారు. ఈ సమ్మెకు తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.