అతిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన త్యాగం మాది : హరీశ్ రావు
Harish Rao | ఆనాడు తెలంగాణ వ్యతిరేకనిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంటే లోపల కేబినెట్లో పోరాడినం.. ముఖ్యమంత్రిని కలిసి కూడా ఈ నిర్ణయాలు ఉప సంహరించుకోవాలని చెప్పినమన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు.
Harish Rao | చిల్లరగా మాట్లాడే రేవంత్ రెడ్డికి చిల్లరగానే సమాధానం చెప్పాలి.. నిన్న రేవంత్ రెడ్డి అతి తెలివితేటలు చూపిస్తూ అతిగా మాట్లాడాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేము తెలంగాణ సోయిగల్లోళ్లం, తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ కనుక.. అణువణువునా తెలంగాణ తనాన్ని ఉన్న కేసీఆర్ నాయకత్వంలో పని చేసేటోళ్లం కనుక.. ఆనాడు తెలంగాణ వ్యతిరేకనిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంటే లోపల కేబినెట్లో పోరాడినం.. ముఖ్యమంత్రిని కలిసి కూడా ఈ నిర్ణయాలు ఉప సంహరించుకోవాలని చెప్పినమన్నారు.
ఢిల్లీలో ఈ రాష్ట్ర ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్‌కు, ప్రధానమంత్రికి, సోనియాగాంధీకి కూడా కేసీఆర్ ఫిర్యాదు చేశారు.. రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి.. ఆ నిర్ణయాల్లో మేం భాగస్వామ్యం కాదలచుకోలేదు.. ఈ తప్పుడు నిర్ణయాలకు మేం భాగస్వామిగా ఉండం.. మేం బయటకు వెళ్లిపోతాం.. అని స్పష్టంగా చెప్పామని హరీశ్ రావు గుర్తు చేశారు.. మీరు ఆ రోజు తెలంగాణ ఇస్తామని రాష్ట్రపతి నోట ఉభయ పార్లమెంట్ సభల్లో చెప్పించడం వల్ల, కామన్ మినిమం ప్రోగ్రామ్‌లో పెట్టడం వల్ల మీ హైకమాండ్ సోనియాగాంధీ రిక్వెస్ట్ వల్ల కేసీఆర్ ఆదేశంతో మేం కేబినెట్లో చేరాం.. రాజశేఖర్ రెడ్డి ఎవరు..? మాది స్వతంత్ర పార్టీ.. మేం ఆరుగురం మంత్రులం అయినమంటే అది కేసీఆర్ నిర్ణయం.. కేసీఆర్ భిక్ష. తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పార్టీలో చర్చ జరిగినప్పుడు కేసీఆర్ వైదొలగాలని ఆదేశిస్తే అర్థరాత్రి అమెరికా నుంచి ఫ్యాక్స్‌లో మంత్రి పదవులను గడ్డిపోచల్లాగా రాజీనామాలు చేసిన త్యాగం మాదన్నారు హరీశ్ రావు.
మేము రాజీనామా చేసిన తర్వాత 9 నెలలకు ఈ GOలు వచ్చాయి. దీని మీద మేం మాట్లాడితే రేవంత్ రెడడ్ఇ నువ్వేం మాట్లాడుతవ్.. లేదు లేదు అంతకుముందే బడ్జెట్ అప్రూవల్ అయింది.. అది బడ్జెట్లో ఉండదు.. పద్దులు కేబినెట్‌కు రానే రావు.. అసలు ఆ పులిచింతల, పోతిరెడ్డిపాడు కావొచ్చు.. జీవో 610 అమలు కావొచ్చు.. తెలంగాణకు సంబంధించిన అనేక నిర్ణయాలు, హంద్రీనీవా కానీ ఇలాంటి తప్పుడు నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నవ్ కనుకనే మేం తెలంగాణ కోసం సోనియాగాంధీ మీద గౌరవంతో చేరిన.. మీరు రాష్ట్రం ఇస్తమంటేనే చేరినం.. ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు భాగస్వామ్యం కాదని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చినోళ్లం మేం.. త్యాగాలు మావి.. నువ్వేం మాట్లాడుతున్నవ్ రేవంత్ రెడ్డి అని హరీశ్ రావు ఫైర్ అయ్యారు.
తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు ఆ నాడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటే మేము పోరాడాము
రాజశేఖర్ రెడ్డి నిర్ణయాలు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నాయి, ఆ నిర్ణయాల్లో మేము భాగస్వాములుగా ఉండదల్చుకోలేదని వెళ్లిపోయాము
మీరు ఆ రోజు తెలంగాణ ఇస్తామని, రాష్ట్రపతితో ఉభయ పార్లమెంట్ సభలలో చెప్పించడం వల్ల, సోనియా గాంధీ రిక్వెస్ట్ చేయడం వల్ల మేము క్యాబినెట్లో చేరాము
తెలంగాణకు అన్యాయం జరుగుతుందని పార్టీలో చర్చ జరిగితే వైదొలగాలని కేసీఆర్ ఆదేశిస్తే అర్ధరాత్రి అమెరికా నుండి ఫ్యాక్స్ పంపి మంత్రి పదవులను గడ్డి పూసల్లాగా త్యాగం చేసాము
మేము రాజీనామా చేసిన తర్వాత 9 నెలలకు ఈ GOలు వచ్చాయి
ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల మేము రాజీనామా చేసాము
మేము విసిరేసిన ఎంగిలి పదవులు తీసుకొని పెదవులు మూసుకుంది మీరు
– హరీష్ రావు
— Telugu Scribe (@TeluguScribe) November 24, 2026
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అతిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన త్యాగం మాది : హరీశ్ రావు
Road accident | విషాదం..కొడుకును సాగనంపి, తిరిగిరాని లోకాలకు తల్లిదండ్రులు
Arrest | నకిలీ కరెన్సీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు..నలుగురు అరెస్ట్
BDL | బీడీఎల్ సంగారెడ్డిలో 134 ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు.. చివరితేదీ నవంబర్ 30
Punjab Elections | బీజేపీ, అకాలీదళ్ పార్టీ మధ్య కుదిరిన పొత్తు.. పంజాబ్‌లో ఆరేళ్ల తర్వాత మళ్లీ కలిసిన బంధం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

