Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Y.S. Jagan | ఏపీలో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశాల్లేవని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.
అమరావతి : ఏపీలో ఎన్నికలు ( Elections ) స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగే అవకాశాల్లేవని వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ( Y.S. Jagan ) అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి వైసీపీ అభ్యర్థులు, నాయకులపై దాడులకు పాల్పడుతూ ఎన్నికల్లో పాల్గొనకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. గురువారం వైసీపీ జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన వీడియో సమావేశంలో మాట్లాడారు.
మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగే రోజున వైసీపీ శ్రేణులు మరింత జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని సూచించారు. చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) లాంటి రాక్షసుడితో ( Monster ) యుద్ధం చేస్తున్నాం. నామినేషన్ల ఘట్టంలో జరిగిన ఘటనలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు కూడా సేకరించాలి. వీటిపై తప్పకుండా న్యాయపోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
పోలీసుల అండదండలతో వైసీపీ శ్రేణులపై దాడులు జరిగాయని, రిటర్నింగ్ ఆఫీసర్లు చంద్రబాబే ఏజెంట్లుగా పనిచేశారని ఆరోపించారు. నామినేషన్ పత్రాల్లోని సర్టిఫికెట్లనే ఆర్వోలే చింపేయడం, తొలగించడం లాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడ్డారని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఒక మాఫియా ముఠా మాదిరిగా పనిచేస్తోందని దుయ్యబట్టారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, వీలైతే ప్రైవేట్‌గా వీడియోలు తీసేలా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులకు సూచించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను చితకబాదిన కిష్టమ్మ.. వీడియో
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

