‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం, భవిష్యత్ పోరాటాల కార్యాచరణ రూపకల్పనే లక్ష్యంగా నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ తెలిపారు. గురువారం...
– నవంబర్ 15న లక్ష మంది రైతులతో బహిరంగ సభ
– అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్
రామగిరి, అక్టోబర్ 29 : రైతుల హక్కుల పరిరక్షణ, వ్యవసాయ రంగ సమస్యల పరిష్కారం, భవిష్యత్ పోరాటాల కార్యాచరణ రూపకల్పనే లక్ష్యంగా నవంబర్ 15 నుండి 18 వరకు నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ తెలిపారు. గురువారం రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్, రాష్ట్ర కోశాధికారి మూడో శోభనాయక్, జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డితో కలిసి బహిరంగ సభ స్థలాన్ని ఆయన పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా విజ్జు కృష్ణన్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1,200 మందికి పైగా ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నారని వెల్లడించారు. అఖిల భారత కిసాన్ సభ 90వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో, చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ పోరాట 90వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మహాసభలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలు, కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలపై మహాసభల్లో సమగ్రంగా చర్చించి, రాబోయే మూడేళ్లకు భవిష్యత్ పోరాటాల కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. గత మూడున్నరేళ్లలో దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమాలు, సాధించిన విజయాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వ్యవసాయ విధానాలపై సమీక్షించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. నవంబర్ 15న జరిగే బహిరంగ సభకు మాజీ ఎంపీ బృందా కారత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని, అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షుడు అశోక్ ధావలే తదితర జాతీయ నాయకులు ప్రసంగిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉడుత రవీందర్, జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, సయ్యద్ హశం, ఎండీ సలీం, దండంపల్లి సత్తయ్య, నలపరాజు సైదులు, పరిపూర్ణాచారి, భీమగాని గణేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను చితకబాదిన కిష్టమ్మ.. వీడియో
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
పీఎం శ్రీ ప్రధానోపాధ్యాయులకు బెంగళూరులో శిక్షణ
ఎంజీయూలో వినూత్న కార్యక్రమం.. ‘ఎర్న్ వైల్ యు లెర్న్’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

