Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
Woman lost outside Zoo | కొత్తగా పెళ్లైన జంట జూకు వెళ్లారు. బైక్ పార్క్ చేసి వస్తానని భర్త చెప్పాడు. అయితే అతడు తిరిగి వచ్చి చూడగా భార్య అదృశ్యమైంది. ఒక వ్యక్తి బైక్‌పై వెళ్లిన ఆ యువతి ఆచూకీని 20 రోజుల తర్వాత పోలీసులు కనుగొన్నారు.
భోపాల్: కొత్తగా పెళ్లైన జంట జూకు వెళ్లారు. బైక్ పార్క్ చేసి వస్తానని భర్త చెప్పాడు. అయితే అతడు తిరిగి వచ్చి చూడగా భార్య అదృశ్యమైంది. ఒక వ్యక్తి బైక్‌పై వెళ్లిన ఆ యువతి ఆచూకీని 20 రోజుల తర్వాత పోలీసులు కనుగొన్నారు. (Woman lost outside Zoo) మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. శివపురి జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువకుడికి 18 ఏళ్ల యువతితో ఇటీవల పెళ్లి జరిగింది. బంధువులను కలవడంతో పాటు జూను సందర్శించేందుకు కొత్త జంట గ్వాలియర్ చేరుకున్నారు. బైక్ పార్క్ చేసి వస్తానని చెప్పిన భర్త, జూ గేట్ వద్ద వేచి ఉండమని భార్యకు చెప్పాడు. అయితే అతడు తిరిగి వచ్చేసరికి భార్య అదృశ్యమైంది. ఆందోళన చెందిన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. ఒక వ్యక్తి బైక్‌పై ఆ యువతి వెళ్లినట్లు గుర్తించారు. ఆ వ్యక్తి అర్మాన్ ఖాన్ అని, తన భార్యకు అతడితో సంబంధం ఉన్నదని భర్త ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆ యువతి కోసం వెతికారు. 20 రోజుల తర్వాత ఆమె ఆచూకీని కనుగొన్నారు. అయితే జూ బయట తాను దారి తప్పిపోయానని, అటుగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్ అడిగినట్లు ఆ యువతి చెప్పింది. ఆ వ్యక్తితో తనకు సంబంధం లేదని, కేవలం దారి తెలియక జరిగిన అపార్థం మాత్రమే అని ఆమె పేర్కొంది.
మరోవైపు ఆ యువతిని బైక్‌పై తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆమె మేజర్ కాబట్టి ఆ వ్యక్తితో కలిసి తానంత తానుగా వెళ్లిందా? లేదా అతడు బలవంతంగా ఆమెను తీసుకెళ్లాడా? అన్నది దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఆ మహిళ వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేస్తామని చెప్పారు. పరిస్థితుల ఆధారంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుడితో యుద్ధం చేస్తున్నాం : వైఎస్ జగన్
Woman lost outside Zoo | భర్తతో కలిసి జూకు వెళ్లి అదృశ్యమైన భార్య.. తర్వాత ఏం జరిగిందంటే?
‘రైతుల భవిష్యత్ పోరాటాలకు నల్లగొండ మహాసభలో కార్యాచరణ’
Chain Snachers | చైన్ స్నాచింగ్ దొంగలను కిష్టమ్మ ఎలా చితక్కొట్టిందో చూశారా..?
Mallikarjun Kharge | నిరసనను వాయిదావేసే ప్రసక్తే లేదు, ర్యాలీ నిర్వహించి తీరుతాం : మల్లికార్జున్ ఖర్గే
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

