లండన్: పాకిస్థాన్ మాజీ బౌలర్ వసీం ఆక్రమ్ తన ట్యాలెంట్‌ను మరోసారి చూపించారు. ఇన్‌స్వింగర్ యార్కర్‌తో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ అథర్టన్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇటీవల మరణించిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ జ్ఞాపకార్థం నిర్వహించిన ఛారిటీ మ్యాచ్‌లో ఈ సీన్ కనిపించింది. స్వల్ప రనప్‌తో వచ్చిన అక్రమ్.. స్టన్నింగ్ రీతిలో యార్కర్‌తో ఆకట్టుకున్నాడు. అథర్టన్ ఆ బంతిని ఎదుర్కోవడంలో ఇబ్బందిపడ్డాడు. అథర్టన్‌ను బౌల్డ్ చేసిన సమయంలో వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్లైవ్ లాయిడ్ అంపైరింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో వసీం అక్రమ్ హాఫ్ సెంచరీ కూడా చేశాడు.
Sorry @Athersmike we might get older but some things will stay the same 😉! https://t.co/k2SnvKGvX5
— Wasim Akram (@wasimakramlive) June 19, 2022