కార్తిక్ రాచపూడి, సంయుక్త జంటగా నటిస్తున్న చిత్రం ‘వార్మెన్ బేస్-51’. కిగోర్ దర్శకుడు. కేఆర్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్నది. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. ఈ నెలాఖరున రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నది. హీరో మాట్లాడుతూ ‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. ఊహకందని మలుపులతో సాగుతుంది’ అని తెలిపారు. ‘కొత్తదనాన్ని కోరుకునే వారిని మెప్పించే అన్ని హంగులుంటాయి. ప్రతి పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది’ అని దర్శకనిర్మాతలు చెప్పారు. ‘బిగ్బాస్’ ఫేమ్ విశ్వ కీలక పాత్రలో నటిస్తున్నారు.