జోగులాంబ గద్వాల : జిల్లాలోని ఉండవెల్లి మండలం అలంపూరు చౌరస్తాలో ఉన్న మహాత్నా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు( Students ) రోడ్డెక్కిన ఘటనపై జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector Santosh ) సీరియస్ అయ్యారు. సమస్యలపై నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ వార్డెన్ రజిత, సూపర్వైజర్ నవీన్‌ను సస్పెన్షన్ 9Suspensions ) చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ , గార్డెన్ హౌజ్ మాస్టర్లకు మెమోలు జారీ చేశారు.
పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థులు పాఠశాలలో నెలకొన్న సమస్యలను విన్నవించేందుకు సుమార్ ఏడు కిలోమీటర్లు జాతీయ రహదారిపై నడుచుకుంటూ కలెక్టరేట్‌కు బయలు దేరారు. వారిని పోలీసులు, అధికారులు అడ్డగించినా కాని పాదయాత్రను నిర్వహించారు. చివరకు పోలీసుల సూచనతో డీసీఎంలో ఎక్కిన విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్లారు. అనంతరం విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేశారు.
సీఐతోపాటు తాసీల్దార్లు ప్రభాకర్, జ్యోషి విద్యార్థుల సమస్యలను విన్నారు. 5 తరగతి నుంచి ఇంటర్ వరకు 635 మంది విద్యార్థులు చదువులు సాగిస్తున్నామని , పాఠశాలలో విద్యార్థుల కనీస వసతులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు లేక ఇక్కట్లు పడుతున్నామని కన్నీరు పెట్టుకున్నారు.
బిల్డింగ్ యజమాని ధర్మారెడ్డి విద్యార్థులకు కల్పించాల్సిన వసతులను కల్పించకుండా నిత్యం పాఠశాలలో ఉంటూ విద్యార్థులను ఇష్టమొచ్చిన్నట్లుగా కొడుతున్నాడని, ఫిర్యాదు చేశారు. సీఐ రవిబాబు మాట్లాడుతూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని మీ సమస్యలు త్వరలో పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు . విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న కలెక్టర్ ముందుగా డిప్యూటీ వార్డెన్ , సూపర్వైజర్లను సస్పెన్షన్ చేస్తూ మరో ఇద్దరికి మెమోలు జారీ చేశారు.