సుబేదారి, ఏప్రిల్ 9: కష్టపడి చదివితే సర్కార్ కొలువు సాధ్యమవుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి అన్నారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యం లో పోలీసు ఉద్యోగ పోటీ పరీక్షలకు శిక్షణ పూర్తిచేసుకున్న యువతీ యువకులకు శుక్రవారం హనుమకొండ అంబేద్కర్ భవన్లో పోలీసు కమిషనర్ తరుణ్‌జోషి స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈసందర్భంగా సీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసు, ఇతర ఉద్యోగాలు భర్తీ చేయనున్నదని, యువత సమయం వృథా చేయకుండా కష్టపడి చదవి సర్కార్ ఉద్యోగం సాధించాలని సూచించారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో తొమ్మిది కేంద్రాల్లో రెండు వేల మంది యువతీ యువకులకు ఉచిత కోచింగ్ ఇచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్ జీజేఈఆర్ కోచింగ్ సెంటర్ నిపుణుల నుంచి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేయనున్న అన్ని ఉద్యోగాలకు వరంగల్ పోలీసు కమిషనరేట్ నుంచి ఉచిత శిక్షణ ఇప్పిస్తామన్నారు. డీసీపీ అశోక్‌కుమార్, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్, గిరికుమార్, సీఐలు రాఘవేందర్, శ్రీనివాస్, రవికుమార్, రమేష్ పాల్గొన్నారు.
వెబ్సైట్ ప్రారంభించిన సీపీ
హనుమకొండ చౌరస్తా: పోలెపాక మోహన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ స్పెషల్ క్యాంపు వెబ్సైట్ (http://farmcamper.org)ను శనివారం హనుమకొండ అశోకా హోటల్లో వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు కో కరిక్యులర్, ఎక్స్ ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నేర్చుకోవాలన్నారు. భారతదేశంలో క్యాంపు సంస్కృతిని ప్రోత్సహించాలన్నారు. ఈ శిబిరం ప్రత్యేకమైన శిబిరం అని నిర్వాహకులు మోహన్ పోలెపాకకు అభినందనలు తెలిపారు. రిటైర్డ్ డీఎఫ్ఓ కె.పురుషోత్తం, ఎన్ఐటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రొఫెసర్ రవికుమార్, ప్రిన్సిపాల్స్, కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.