కురవి, ఫిబ్రవరి 23: రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ తండ్రి లింగ్యానాయక్ ఇటీవల మృతి చెందగా, పలువురు ప్రముఖులు బుధ వారం మంత్రిని పరామర్శించారు. రాష్ట్ర పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూ బాబాద్ ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలో త్ కవిత, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, రాష్ట్ర మహిళా ఆర్థిక సహకార సంస్థ చైర్పర్సన్ ఆకుల లలిత, మహి ళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందు, భూపా లపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్‌మిశ్రా, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, నర్సంపేట జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, డైరెక్టర్ నూకల శ్రీరంగారెడ్డి, నూకల శ్రీనివాస్‌రెడ్డి, శ్రీదేవి తదితరులు లింగ్యానా యక్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నూకల నరేశ్‌రెడ్డి, జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, యార్ల మురళీధర్‌రెడ్డి, కొంపల్లి శ్రీనివాస్ రెడ్డి, బయ్యారం సొసైటీ చైర్మన్ మూల మధుకర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, శ్రీరామ్‌నాయక్, బొలిశెట్టి నవీన్, మన్యు ప్యాట్నీ, అఫ్జల్, దుర్గాప్రసాద్, శ్రీకాంత్, సుందర్, యాకూబ్, రాంలాల్, నరహరి, బోడ శ్రీను, కిశోర్వ ర్మ, అధికారులు లక్ష్మి, సబిత, సునంద పాల్గొన్నారు.