నర్సంపేట రూరల్, నవంబర్ 15: ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నర్సంపేట ఏసీపీ ఫణీందర్ సూచించారు. ఆదివారం రాత్రి మండలంలోని ముగ్ధుంపురం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా సరైన పత్రాలు లేని 28 ద్విచక్రవాహనాలు, 6 ఆటోలు, ఒక కార్‌ను పోలీసులు సీజ్ చేశారు. అదేవిధంగా రూ.6,880 నగదుతోపాటు 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు గ్రామంలో ఇంటింటికీ తిరిగి సోదాలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు సమావేశంలో ఏసీపీ ఫణీందర్ మాట్లాడుతూ ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలన్నారు. ఎవరూ అసాంఘిక చర్యలకు పాల్పడవద్దని, చట్టానికి లోబడి ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని చెప్పారు. వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు, విధిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. గ్రామాల్లో ప్రజల భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో ఏసీపీ తిరుమల్, దుగ్గొండి సర్కిల్ సీఐ సతీష్‌బాబు, గ్రామ సర్పంచ్ పెండ్యాల జ్యోతి, ఎంపీటీసీ చీకటి స్వరూప, ఉప సర్పంచ్ చాందావత్ తిరుపతినాయక్, చెన్నారావుపేట ఎస్సై శ్రీలం రవి, దుగ్గొండి, నర్సంపేట మండలాల ఎస్సైలు, ఏఎస్సైలు ఉనారు.