గిర్మాజీపేట, డిసెంబర్ 17: అవయవదానం మరొకరికి ప్రాణదానం అని, ఇందుకు ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహకరించాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ నేత్ర, శరీర అవయతదాతలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పరికిపండ్ల అశోక్ ఆధ్వర్యంలో శనివారం శివనగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే నన్నపునేని మాట్లాడుతూ చనిపోయిన తర్వాత మృతదేహాలకు దహన ససంస్కారాలు, ఖననం చేయడం వల్ల అవయవాలు మట్టిలో కలిసిపోతాయన్నారు. ఈ క్రమం లో అందరూ అవయవదానం చేసి చిరంజీవులుగా మిగిలిపోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పద్మబ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు మల్లిపెద్ది కృష్ణశాస్త్రి, భారతిచారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ రాజేంద్రప్రసాద్, విశ్రాంత ఎంపీడీవో గొల్లపెల్లి విద్యాసాగర్, మునగాల కృష్ణ, పొన్నం నర్సింహ, వెంగల నాగేశ్వరరావు, బీఆర్ఎస్ నాయకులు బోగి సురేశ్ పాల్గొన్నారు.
క్యాలెండర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
శ్రీబాలాజీ రెస్టారెంట్-2023 సంవత్సరానికి సం బంధించిన క్యాలెండర్‌ను యజమాని లయన్ డాక్టర్ ఆడెపు రవీందర్ సమక్షంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆవిష్కరించారు. కుమ్మరి సంఘం క్యాలెండర్‌ను సంఘం అధ్యక్షుడు ఆవునూరి రామన్న సమక్షంలో నన్నపునేని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్ దిడ్డి కుమారస్వామి, మూషిక బాబు, రమేశ్‌బాబు, గోరంట్ల రాజు, కుమ్మరిసంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కాసర్ల చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి ఓరుగంటి చరణ్‌రాజ్, జిల్లా యూత్ అధ్యక్షుడు పోతుగంటి రాజశేఖర్, ఆకారపు శ్రీనివాస్, ఆవునూరి శ్రీను, ఆకారపు శ్రీనివాస్, ఆవునూరి రవి, దేవేందర్, రాజు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీపురం పండ్ల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే నన్నపునేనిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో యూనియన్ సభ్యులు మర్రి శ్రీనివాస్, సలహాదారు బోగి సురేశ్, జట్టు రాము, గైని సత్యం, అల్లూరి రాము, చెక్కు ప్రభాకర్, మోర్తాల మల్లారి, ఆడెపు సదయ్య, హరీశ్ పాల్గొన్నారు.