War 2 Trailer | బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న వార్ 2 చిత్రం సరికొత్త రికార్డును నెలకొల్పబోతుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా డాల్బీ అట్మాస్ థియేటర్లలో ప్రదర్శించబడనుంది. దీంతో ఇండియాలో భారీ స్థాయిలో డాల్బీ అట్మాస్ థియేటర్లలో విడుదలవుతున్న మొదటి ఇండియన్ సినిమాగా ‘వార్ 2’ నిలవనుంది. ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు. దీనివలన ఆడియన్స్ డాల్బీ అట్మాస్ సౌండ్‌ను అద్భుతంగా ఆస్వాదించగలుగుతారని.. ఇది భారతీయ చిత్ర నిర్మాణంలో ఒక కొత్త శకానికి నాంది పలకబోతుందని నిర్మాతలు పేర్కొన్నారు.
యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా నేడు ట్రైలర్‌ను పంచుకుంది. YRF స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఈ చిత్రంలో.. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, జూనియర్ ఎన్టీఆర్ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.
2 cinematic icons…one epic WAR!
We’re ready for the biggest on-screen showdown, are you?
It’s bigger, bolder, and spectacular than ever! @yrf ‘s Spy Universe’s #WAR2 will come alive exclusively at Dolby Cinema @iHrithik @tarak9999 @advani_kiara #ayanmukerji #YRFSpyUniverse pic.twitter.com/067uZFRw9i— Dolby India (@DolbyIn) July 24, 2025