పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
పెళ్లయిన 45 రోజులకే భర్తను హత్య చేసేందుకు భార్య ప్రియుడితో కలిసి పథకం రచించిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో వెలుగుచూసింది. భర్త షబ్బీర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు భార్య షాహిదా బేగం, ఆమె ప్రియుడు షాకీర్, అతడి స్నేహితుడు మహేశ్వర్ లాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పెళ్లయిన 45 రోజులకే భర్తను హత్య చేసేందుకు భార్య ప్రియుడితో కలిసి పథకం రచించిన ఘటన వనపర్తి జిల్లా కేంద్రంలోని బ్రహ్మంగారి వీధిలో వెలుగుచూసింది. భర్త షబ్బీర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు భార్య షాహిదా బేగం, ఆమె ప్రియుడు షాకీర్, అతడి స్నేహితుడు మహేశ్వర్ లాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన షాహిదా బేగంతో షబ్బీర్‌కు 45 రోజుల క్రితం వివాహమైంది. అయితే, పెళ్లికి ముందే హైదరాబాద్‌కు చెందిన తన సమీప బంధువు షాకీర్‌తో షాహిదా ప్రేమలో ఉంది. వివాహం తర్వాత కూడా అతడిని మర్చిపోలేకపోయిన ఆమె.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది.
తమ ప్లాన్‌లో భాగంగా ఈ నెల 15న షబ్బీర్ నిద్రిస్తున్న సమయంలో తన స్నేహితుడు మహేశ్వర్లాల్తో కలిసి షాకీర్ వాళ్లింటికి వెళ్లాడు. మహేశ్వర్ ఇంటి బయట ఉండగా.. షాకిర్ బయట బైక్‌పై కాపలా ఉన్నాడు. అనంతరం షాహిదా తన భర్త చేతులను పట్టుకోగా, షాకీర్ బెల్టుతో గొంతు బిగించి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, షబ్బీర్ గట్టిగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మేల్కొని తలుపు తట్టారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వారిని పట్టుకున్నారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని షాహిదా బేగం, షాకీర్, మహేశ్వర్ లాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

