Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | బతుకమ్మ, దసరా పండుగళ వేళ ఆర్టీసీ టికెట్ ఛార్జీలను పెంచుకోవడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. పండుగలు వస్తే చాలు.. ఇష్టం ఉన్నట్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
Harish Rao | బతుకమ్మ, దసరా పండుగళ వేళ ఆర్టీసీ టికెట్ ఛార్జీలను పెంచుకోవడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. పండుగలు వస్తే చాలు.. ఇష్టం ఉన్నట్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలను బాదుడేనా అని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. బతుకమ్మ, దసరా పండుగ వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి.. టికెట్ ధరలను డబుల్ చేసి నిలువుదోపిడీ చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.
పండుగ సమయంలో రెగ్యులర్ బస్సులు తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పెట్టడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. జేబిఎస్ నుంచి కరీంనగర్‌కు రూ. 230 ఉండే టికెట్‌ను ఏకంగా రూ.400కు పెంచారని తెలిపారు. మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు మొన్నటివరకు రూ.220 ఉండగా.. ఇప్పుడు రూ.290 పైగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూట్లలో టికెట్ ఛార్జీలు డబుల్ చేసి, జేబులు గుల్ల చేసి, ప్రజలకు పండుగ సంబురం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
ఆర్టీసీ బస్సుల సంఖ్య పెంచకుండా, రెగ్యులర్ గా నడిచే బస్సులకే పండుగ స్పెషల్ బోర్డులు తగిలించి చేస్తున్న ఈ దోపిడీ ముమ్మాటికీ ప్రజాపీడనే అవుతుందని హరీశ్‌రావు అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం అని చెప్పి.. పురుషుల నుంచి డబుల్ ఛార్జీలు వసూలు చేస్తారా అని ప్రశ్నించారు. భార్యకు ఫ్రీ టికెట్.. భర్తకు డబుల్ టికెట్ వసూలు చేస్తే,
మహిళలకు రాయితీ ఇచ్చినట్టా? లేక ఆ భారాన్ని తిరిగి అదే కుటుంబంపై మోపినట్టా అని నిలదీశారు. ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన అని మండిపడ్డారు.
ఇప్పటికే మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆర్టీసీ టికెట్ ఛార్జీలను ఐదు సార్లు పెంచారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు పండుగల పేరుతో డబుల్ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. రేవంత్ ప్రభుత్వ తీరుతో పండుగలకు సొంతూళ్లకు వెళ్లాలంటేనే పేద, మధ్యతరగతి ప్రజలు భయపడే దుస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, పండుగల పేరుతో పెంచిన అడ్డగోలు ఛార్జీలను తగ్గించాలన్నారు. రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడిపి, పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

