వనపర్తి, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ) : దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటునందిస్తుంద ని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపా రు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్హాల్లో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు ప్రతి మండలంలో ఐదు శాతం డబుల్ బెడ్రూం ఇం డ్లు కేటాయిస్తామని, జిల్లా కేంద్రంలో దివ్యాంగుల భవన నిర్మాణం కోసం 10 గుంటల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. వేరుశనగ పరిశోధన కేంద్ర ని ర్మాణ పనులకు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. ప్ర పంచ మేధావి అయిన దివ్యాంగుడు ఎవరు..? అని మంత్రి ప్రశ్నించగా.. స్టీఫెన్ హాకింగ్ అని రఘుపతిరెడ్డి చెప్పడంతో అతడికి రూ.500, మరో వ్యక్తికి రూ.500 అందజేశారు. క లెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా మాట్లాడుతూ దివ్యాంగుల స్వ యం ఉపాధి కోసం బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నట్లు వివరించారు. అనంతరం ఉపాధి పనుల్లో ప్రతిభ కనబర్చిన వా రికి ప్రశంసా పత్రాలు, సదరం సర్టిఫికెట్లు అందజేశారు. కా ర్యక్రమంలో వనపర్తి జెడ్పీ చైర్మన్ లోకనాథ్‌రెడ్డి, అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, డీడబ్ల్యూవో పుష్పలత, డీఈవో ర వీందర్, డీపీవో సురేశ్‌కుమార్, డీఆర్డీవో నర్సింహులు, అదనపు ఆర్డీవో కృష్ణయ్య, అలివేలమ్మ, నాగచైతన్య ఉన్నారు.