ఆ ఇల్లు కొండలు ఎక్కగలదు.. జారుడు బండ మీద, రెండు గుట్టల మధ్య ఆగగలదు.. నీటిలోనూ నడవగలదు.. ఒకచోట ఉండాలని అనిపించకపోతే, మూటా-ముల్లె సర్దుకొని ఇల్లుతో సహా వేరేచోటుకు వెళ్లిపోవచ్చు. అదెలా అనుకొంటున్నారా! బల్గేరియాలోని సోఫియాకు చెందిన ప్రముఖ డిజైనర్ ఎన్కో ఎంచెవ్ రూపొందించిన ఈ ఇల్లు.. నడిచే ఇల్లు. దానికి ఆరు కాళ్లుంటాయి. ఎత్తు, లోతు ప్రదేశాన్ని బట్టి దాని కాళ్లను సెట్ చేసుకోవచ్చు. టూరిస్టుల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ ఇంట్లో ఇద్దరు మనుషులు, ఒక పెంపుడు జంతువుతో కలిసి ఉండొచ్చు. ఇందులో బెడ్రూం, లివింగ్ ఏరియా, గెస్ట్ రూం, కిచెన్, డైనింగ్ టేబుల్, బాత్రూం, పార్టీ చేసుకొనేందుకు వీలుగా టెర్రస్, హైక్వాలిటీ ఫర్నిచర్ సహా స్మార్ట్ టెక్నాలజీ కిటికీ గ్లాస్‌ను ఏర్పాటు చేశాడీ డిజైనర్. ఇంటి కింది భాగంలో బైక్స్, కారు పెట్టుకోవచ్చు. లేకపోతే గ్యారేజీలా వాడుకోవచ్చు. ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెళ్లు, వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది. డిజైన్ వరకైతే పూర్తయిన ఈ మొబైల్ హౌజ్‌ను సమీప భవిష్యత్తులో నిర్మిస్తానని ఎన్కో చెప్తున్నాడు.