e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home News టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే హుజూరాబాద్‌ ప్రజల భవిష్యత్‌ : మంత్రి హరీశ్‌రావు

టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే హుజూరాబాద్‌ ప్రజల భవిష్యత్‌ : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ : టీఆర్ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్‌ ప్రజల భవిష్యత్‌ ఉందని, ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. హుజూరాబాద్‌ పట్టణంలోని బీఎస్‌ఆర్‌ గార్డెన్‌లో రజక సంఘం సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రజకుల ఆత్మగౌరవాన్ని పెంచింది టీఆర్‌ఎస్‌ పార్టేనన్నారు.

చాకలి ఐలమ్మ జయంతిని అధికారంగా జరుపాలని నిర్ణయించిందని టీఆర్‌ఎస్‌ పార్టీ అని, సీఎం కేసీఆర్‌ ఇందుకు అంగీకరించారన్నారు. చాకలి ఐలమ్మ రజకుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఎంబీసీ కార్పోరేషన్ ద్వారా రుణాలు కావాలని కోరుతున్నారని, త్వరలోనే ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఆధునిక దోభీఘాట్‌ సైతం నిర్మిస్తామని, గత పదేళ్ల నుంచి కోరుతున్న వస్తున్న రజకుల భవన్‌ కోసం ఎకం భూమి, రూ.కోటి మంజూరు చేసినట్లు చెప్పారు. ఈ నెల 26న రజకుల సభ, రజక భవన్‌కు భూమిపూజ జరుగుతుందన్నారు.

- Advertisement -

హుజూరాబాద్‌లో ఈ నెల 26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, కేసీఆర్‌, రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్‌ ఇస్తోందని గుర్తు చేశారు. బీజేపీ పార్టీ ఏం ఇచ్చిందని.. డబుల్‌ బెడ్రూంలు ఇచ్చిందా.. డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచినందుకు ఓట్లు వేయాలా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ గెలుపుతోనే హుజూరాబాద్‌కు ప్రయోజనమన్నారు. టీఆర్‌ఎస్‌ తప్ప బీజేపీతో ఎలాంటి ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement