e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News 5జీ ట్రయల్స్‌లో వొడా ఐడియా రికార్డ్‌ 4 జీబీపీఎస్‌తో డాటా బదిలీ

5జీ ట్రయల్స్‌లో వొడా ఐడియా రికార్డ్‌ 4 జీబీపీఎస్‌తో డాటా బదిలీ

న్యూఢిల్లీ, నవంబర్‌ 26: టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (వీఐఎల్‌) 5జీ ట్రయల్స్‌లో రికార్డ్‌ సృష్టించింది. ప్రస్తుతం జరుపుతున్న 5జీ ట్రయల్స్‌లో భాగంగా సెకండ్‌కు 4 గిగాబైట్‌ స్పీడ్‌ (4 జీబీపీఎస్‌)తో డేటాను 5జీ ఫోన్‌ వాడుతున్న కస్టమర్లకు విజయవంతంగా బదిలీ చేసినట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇంత అధికవేగంతో ఇప్పటివరకూ డాటాను డెలివరీ చేసింది తామేనని వొడాఫోన్‌ తెలిపింది. 26 గిగాహెడ్జ్‌ స్పెక్ట్రం బ్యాండ్‌పై ఈ స్పీడ్‌ సాధించామని వీఐఎల్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ జగ్బీర్‌ సింగ్‌ చెప్పారు. 5జీ సర్వీసులకు అనుగుణంగా తమ నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తున్నామన్నారు. 5జీ ట్రయల్స్‌ గడువును మరో ఆరునెలలు ప్రభుత్వం పెంచిందని, ఈ ట్రయల్స్‌ 2022 మే వరకూ లేదా స్పెక్ట్రం వేలం ఫలితాలు వెలువడేవరకూ జరుగుతాయని సింగ్‌ వివరించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement