Vivo X200T : చైనాకు చెందిన మొబైల్ బ్రాండ్ వివో సంస్థ ఇండియాలో మరో ప్రీమియం మొబైల్ ఫోన్ లాంఛ్ చేసింది. వివో ఎక్స్200టి పేరుతో హైఎండ్ ఫోన్‌ను విడుదల చేసింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న వివో ఎక్స్200 ఎఫ్ఈ, వివో ఎక్స్300 మొబైల్స్‌కు మధ్య రేంజ్లో ఉంటుంది. ఇది వన్ ప్లస్ 15ఆర్, ఐకూ 15ఆర్,వివో ఎక్స్300 ఫోన్లకు గట్టి పోటీ ఇస్తుందని అంచనా.
ఈ ఫోన్ ఫీచర్ల వివరాలివి. 12జీబీ+256జీబీ, 12జీబీ+512జీబీ స్టోరేజ్, 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డి+ రెజల్యూషన్, పంచ్ హోల్ కటౌట్ సెల్ఫీ కెమెరా, ఎల్పీటీవో టెక్నాలజీ, మిడియాటెక్ డెమెన్సిటీ 9,400+, ఆండ్రాయిడ్ 16 ఓఎస్ విత్ వివోస్ ఒరిజిన్ ఓఎస్ 6, ఏడేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఐదేళ్లపాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్, 6,200 ఎంఏహెచ్ బ్యాటరీ, 90 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 40 వాట్స్ వైర్లెస్ చార్జింగ్, ట్రిపుల్ రేర్ కెమెరా (50 ఎంపీ సోనీ మెయిన్ సెన్సర్, 50 ఎంపీ సాంసంగ్ అల్ట్రా వైడ్ కెమెరా, 3ఎక్స్50ఎంపీ సోనీ ఎల్వైటీ టెలీఫొటో లెన్స్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ68, ఐపీ 69 రేటింగ్స్, 3డీ అల్ట్రా సోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లున్నాయి.
వీటి ధర రూ.59,999, రూ.69,999గా ఉండనుంది. ఫిబ్రవరి 3 నుంచి ఈ ఫోన్ ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. కొన్ని కార్డులపై డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.