పోషణ
మానవుడు తీసుకునే ఆహారంలో 5 రకాల పోషక పదార్థాలు ఉంటాయి.
కార్బోహైడ్రేట్స్- పిండి పదార్థాలు- శక్తివనరులు/శక్తి జనకాలు.
ప్రొటీనులు-మాంసకృత్తులు- దేహనిర్మాణ/శరీర నిర్మాణకాలు.
లిపిడ్స్- కొవ్వులు- అధిక శక్తి వనరులు/ అధిక శక్తి జనకాలు.
విటమిన్లు సూక్ష్మపోషకాలు ఖనిజ లవణాలు
కార్బోహైడ్రేట్లు( పిండి పదార్థాలు):
ఇవి ఎక్కువగా వరి, గోదుమ, జొన్న, మొక్క జొన్న, సజ్జ, రాగుల్లో లభిస్తాయి. ఇది మానవునికి శక్తిని ఇస్తాయి. కాబట్టి వీటిని శక్తి వనరులు లేదా శక్తి జనకాలు అని అంటారు.
ప్రొటీన్లు(మాంసకృత్తులు):
ఇవి పప్పు, ధాన్యాల్లో ఎక్కువగా లభిస్తాయి.
ఇవి మానవుని పెరుగుదలకు సహాయపడతాయి. కాబట్టి వీటిని బాడీ బిల్డర్స్ లేదా శరీర నిర్మాణాలు లేదా దేహ నిర్మాణాలు అని అంటారు.
లిపిడ్స్ (కొవ్వులు):
ఇవి ఎక్కువగా నూనెల్లో లభిస్తాయి. ఇవి మానవునికి అధిక శక్తినిస్తాయి. కాబట్టి వీటిని అధిక శక్తి వనరులు లేదా అధిక శక్తి ఖనిజాలు అని అంటారు.
విటమిన్లు, ఖనిజ లవణాలు:
ఇవి ఎక్కువగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ల్లో లభిస్తాయి.
ఇవి మానవుని రోగ నిరోధకశక్తిని పంచడంలో సహాయపడతాయి.
మానవుడు ఎక్కువ మోతాదులో కార్బొహైడ్రేట్లను, ప్రొటీన్లలను, లిపిడ్స్‌ను తీసుకుంటారు. కాబట్టి వీటిని స్థూలపోషకాలు అని అంటారు.
మానవుడు తక్కువ మోతాదులో విటమిన్లను, ఖనిజ లవణాలను తీసుకుంటాడు. కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అని అంటారు.
విటమిన్లు:
విటమిన్లని 1912వ సంవత్సరంలో హాఫ్కేన్స్ అనే శాస్త్రవేత్త పాలలో కనుగొన్నాడు.
విటమిన్లు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త- ఫ్రంక్. ఇతడు జపాన్ దేశస్తులకు ఫాలిష్ చేసిన బియ్యాన్ని తినడం ద్వారా బెరి-బెరి వ్యాధి వస్తుందని 1912లో నిరూపించాడు.
విటమిన్లు 2 రకాలు
1. నీటిలో కరిగే విటమిన్లు (బి, సి)
2.కొవ్వులో కరిగే విటమిన్లు (ఎ, డి, ఇ, కె )
మొట్టమొదటిసారిగా కనుగొనబడిన విటమిన్
‘సి’ విటమిన్.
దీనిని ‘లిండర్ మ్యాన్ ’ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
భారతదేశానికి చెందిన NIN శాస్త్రవేత్తలు 2 కొత్త రకాల విటమిన్లను కనుగొన్నారు. అవి.
బి 17 విటమిన్- దీనిని బ్లడ్ క్యాన్సర్ నివారణ/ట్రీట్మెంట్లో వాడతారు.
క్యూ విటమిన్- దీనిని రక్తం గడ్డ కట్టించడంలోఉపయోగిస్తారు.
కొవ్వులో కరిగే విటమిన్లు (ఎ, డి, ఇ, కె )
విటమిన్ – ఎ
రసాయన నామం-రెటినాల్
లోపిస్తే కలిగే వ్యాధులు- రేచీకటి, జిరాఫ్థాల్మియా, వర్ణాంధత్వం, కెరటోమలేషియా.
ప్రాముఖ్యత- ఈ విటమిన్ కంటిచూపుకు తోడ్పడుతుంది.
ఎక్కువగా క్యారట్, బచ్చలికూర, బొప్పాయి, చేపల్లో లభిస్తుంది.
క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది.
ప్రతిరోజు చిన్నపిల్లలకు 750గ్రాములు ఇవ్వాలి.
క్యారట్ నారింజ రంగులో ఉండటానికి కారణమయ్యే ప్రొటీన్- బి కెరోటిన్
విటమిన్-డి
రసాయన నామం-కాల్సిఫెరాల్.
లోపం వల్ల కలిగే వ్యాధులు- రికెట్స్, ఆస్ట్రియోమలేసియా, సొరియాసిస్, ఆస్ట్రియోఫోనోసిస్.
ప్రాముఖ్యత- డి విటమిన్ ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది.
దీనిని ‘సన్‌షైన్’విటమిన్, ఫ్రీ విటమిన్ అని కూడా అంటారు.
ఎక్కువగా షార్క్, చేప కాలేయం, కాడ చేప కాలేయంలో లభిస్తుంది.
Ant -రికెట్స్ విటమిన్ అంటారు.
దీనిని కనుగొన్న శాస్త్రవేత్త- మెక్కల్లమ్.
విటమిన్-ఇ
రసాయన నామం-టోకీఫెరాల్
లోపం వల్ల కలిగే వ్యాధులు- పురుషుల్లో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావం.
ప్రాముఖ్యత- ఈ విటమిన్ ఎక్కువగా మొలకెత్తిన విత్తనాల్లో లభిస్తుంది.
దీనిని బ్యూటీ విటమిన్, సెక్స్‌వల్ విటమిన్ అని కూడా అంటారు.
ఇది ప్రత్యుత్పత్తి అవయవాల పనిలో సహకరిస్తుంది.
క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది.
దీనిని యాంటి స్టెరిలిటీ అని అంటారు.
ఈ విటమిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త- ఇవాన్స్ బషప్.
విటమిన్-కె
రసాయన నామం-ఫిల్లో క్వినోన్, నాప్తో క్వినోన్.
లోపం వల్ల కలిగే వ్యాధులు- అధిక రక్తస్రావం (హిమోఫిలియా)
ప్రాముఖ్యత-ఈ విటమిన్ రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది.
ఇది ఎక్కువగా ఆవుపాలు, క్యాబేజ్, క్యాలిఫ్లవర్‌లో లభిస్తుంది.
ఈశ్వరీషియా కొలై (ఈ కొలై) అను బ్యాక్టీరియా జీవక్రియలో పాల్గొంటుంది.
దీనిని యాంటి బ్లీడింగ్ విటమిన్ అని అంటారు.
ఈ విటమిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త- డాయిసీ& డమ్
విటమిన్-బి 1
రసాయన నామం- థయామిన్
లోపం వల్ల కలిగే వ్యాధులు- బెరి-బెరి (ఈ వ్యాధి ముఖ్యలక్షణం కండరాల నొప్పులు, ఆకలి లేక పోవడం)
ప్రాముఖ్యత- ఇది నీటిలో వేగంగా కరుగుతుంది.
ఇది ‘సల్ఫర్’ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది.
ఈ విటమిన్ ఆహారం వండడం ద్వారా గంజితో బయటకు పోతుంది.
విటమిన్- బి 2
రసాయన నామం- రైబోప్లావిన్
లోపం వల్ల కలిగే వ్యాధులు- గ్లాసైటిస్ (ఈ వ్యాధి ముఖ్యలక్షణం నాలుక ఉబ్బడం, నాలుక పైన పుండ్లు ఏర్పడటం)
కీలోసిస్ (నోటిలో పుండ్లు ఏర్పడుట)
ప్రాముఖ్యత- ఈ విటమిన్ ఆవుపాలకు లేతపసుపు రంగు ఇస్తుంది. కాబట్టి వీటిని ఎల్లో విటమిన్ అని అంటారు.
విటమిన్-బి 3
లోపం వల్ల కలిగే వ్యాధులు- పెల్లగ్రా (ఈ వ్యాధి ముఖ్యలక్షణం- రెండు చేతులపైన చర్మం పొలుసులుగా రాలి, చేతులు ఉబ్బి రక్తస్రావం జరుగుతుంది)
ప్రాముఖ్యత- ఈ విటమిన్ స్థూల పోషకాల జీవక్రియలో పాల్గొంటుంది. (కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, లిపిడ్స్)
విటమిన్- బి5
రసాయన నామం- పాంటోథెనిక్ ఆమ్లం
లోపం వల్ల కలిగే వ్యాధులు- అరిచేతులు, అరికాళ్లు మంటకు గురికావడం. బాలనెరుపు (10 సంవత్సరాల లోపు ఉన్న చిన్న పిల్లల్లో తెల్ల వెంట్రుకలు రావడం)
ప్రాముఖ్యత- ఈ విటమిన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది.
అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొంటుంది.
విటమిన్-బి6
రసాయన నామం-పెలిడాక్సిన్
లోపం వల్ల కలిగే వ్యాధులు- ఎనిమియా (రక్తహీనత). ఈ వ్యాధి స్త్రీలకు ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గడం వల్ల వస్తుంది.
ప్రాముఖ్యత- ఈ విటమిన్ హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది.
అమైనో ఆమ్లాల జీవక్రియలో పాల్గొంటుంది.
విటమిన్- బి7
రసాయన నామం- బయోటిన్
లోపం వల్ల కలిగే వ్యాధులు- నాడీ సంబంధిత వ్యాధులు (దీనిలో మైగ్రేన్ తలనొప్పి వస్తుంది)
ప్రాముఖ్యత- ఈ విటమిన్ పచ్చికోడిగుడ్డులో లభిస్తుంది.
సల్ఫర్ అనే మూలకాన్ని కలిగి ఉంటుంది.
బి7 విటమిన్ ప్రొటీన్ల జీవక్రియలో పాల్గొంటుంది.
విటమిన్- బి 9, బి11
రసాయన నామం- ఫోలిక్ ఆమ్లం
లోపం వల్ల కలిగే వ్యాధులు- ఎనిమియా (రక్తహీనత)
ప్రాముఖ్యత- హిమోగ్లోబిన్ ఉత్పత్తిలో పాల్గొంటుంది.
ఆహార పదార్థాలను ఉడకబెట్టడం వల్ల ఈ విటమిన్ నశించిపోతుంది.
ఈ విటమిన్ న్యూక్లిక్ ఆమ్లాల (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ) జీవక్రియలో పాల్గొంటుంది.
‘అస్తిమజ్జ’లోని ఎర్రరక్త కణాల ఉత్పత్తిలో పాల్గొంటుంది.
విటమిన్- బి12
రసాయన నామం- సయానకోబాలమిన్
లోపం వల్ల కలిగే వ్యాధులు- ఫెర్నిషఙయస్ ఎనిమియా (హానికర రక్తహీనత) ఈ వ్యాధి స్త్రీలకు హిమోగ్లోబిన్ తగ్గడం వల్ల వస్తుంది.
ప్రాముఖ్యత- విటమిన్ బి12లో ఉండే మూలకం కోబాల్ (co+2)
మానవుని శరీరంలో ఉండే ఏకైక విటమిన్ బి 12. ఇది కాలేయంలో నిల్వచేయబడుతుంది.
ఇశ్చరీషయా కోలై (ఈ -కోలై) అనే బ్యాక్టీరియా జీవక్రియలో పాల్గొంటుంది.
విటమిన్- సి
రసాయన నామం- ఆస్కార్భిక్ ఆమ్లం లేదా సిట్రిక్ ఆమ్లం
లోపం వల్ల కలిగే వ్యాధులు- స్వర్వీ (ఈ వ్యాధి ముఖ్యలక్షణం- చిగుళ్లలో రక్తస్రావం జరగడం)
ప్రాముఖ్యత- ఈ విటమిన్ ఎక్కువగా సిట్రస్ జాతి ఫలాలు (ఉసిరి, బత్తాయి, నిమ్మతో పాటు జామ, టొమాటోలో లభిస్తుంది.
ఇది వేడిచేస్తే నశించిపోతుంది.
గాయాలు మానడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి సహాయపడుతుంది.
ఇది క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
దంతాల్లో డెంటిన్ అనే పదార్థం ఏర్పడేందుకు అవసరం అవుతుంది.
మానవుని మూత్రం ద్వారా బయటకు విసర్జించబడుతుంది.
మానవుని రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
రక్తంలోని ఐరన్ సంశ్లేషణలో జీవక్రియలో విటమిన్-సి పాల్గొంటుంది.
మానవుని శరీరంలో గల కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది.
కొల్లెజెన్ అనే ప్రొటిన్ సంశ్లేషనలో దాని జీవక్రియలక్ష పాల్గొనేది విటమిన్- సి .
చేపల్లో లభించే విటమిన్లు – ఎ, డి
క్యాన్సర్ నిరోధకంగా పనిచేసే విటమిన్లు- ఎ, ఇ, సి
వేడిచేస్తే నశించిపోయే విటమిన్లు- బి 9, సి
సల్ఫర్ అనేమూలకాన్ని కలిగిన విటమిన్లు- బి1, బి7
స్థూలపోషకాల జీవక్రియలో పాల్గొనే విటమిన్లు- బి3, బి5
ఎనిమియా వ్యాధిని కలుగజేసే విటమిన్లు- బి6, బి7
ఈశ్చరీషియా కొలై అనే బ్యాక్టీరియా జీవక్రియలో పాల్గొనే విటమిన్లు- కె, బి12
రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే విటమిన్లు- కె. క్యూ
పోషకాహార లోపం వల్ల కలిగే వ్యాధులు
ఈ వ్యాధులు 3 రకాలు:
1. క్వాషియోర్కర్
2.మేరాస్మెస్
3. స్థూలకాయత్వం
1. క్వాషియోర్కర్
ఈ వ్యాధి చిన్నపిల్లలకు ప్రొటీనుల లోపం వల్ల వస్తుంది.
ఈ వ్యాధి ముఖ్యలక్షణం- శరీర భాగాల్లో నీరు చేరి ఉబ్బి ఎక్కువగా పొట్టభాగం ఉబ్బినట్లు కనిపించడం.
తల వెంట్రుకలు పలుచబడటం, పెరుగుదల మందగించడం.
ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయబడిన శిశువు అని అంటారు.
2.మేరాస్ మస్
ఈ వ్యాధి చిన్న పిల్లలకు కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్ల లోపం వల్ల వస్తుంది.
ఈ వ్యాధి ముఖ్యలక్షణం- బలహీనంగా మారి పక్కటెముకలు పైకి కనిపించడం, పెరుగుదల మందగించడం తలవెంట్రుకలు పలుచబడటం.
ఈ వ్యాధి వెనువెంటనే గర్భం దాల్చిన స్త్రీలకు పుట్టబోయే పిల్లలకు వస్తుంది.
3. స్థూలకాయత్వం
ఈ వ్యాధి అధికంగా కొవ్వు పదార్థాలను తీసుకోవడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ వ్యాధి వచ్చిన వ్యక్తులకు భవిష్యత్తులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది.
టీ కృష్ణ
విషయ నిపుణులు
ఏకేఆర్ స్టడీ సర్కిల్