న్యూఢిల్లీ: భారత స్టార్ ప్యాడ్లర్ శరత్ కమల్ గొప్ప మనసు చాటుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువ ప్లేయర్ విశ్వ దీన్దయాలన్ కుటుంబానికి కమల్ అండగా నిలిచాడు. రికార్డు స్థాయిలో పదోసారి జాతీయ టీటీ టైటిల్ దక్కించుకోవడం ద్వారా లభించిన రూ.2.75 లక్షల నగదు బహుమతిని కమల్ వారి కుటుంబానికి అందజేశాడు. మిగతా ప్లేయర్లతో కలిసి యువ ప్లేయర్ తల్లిదండ్రులకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తానని కమల్ పేర్కొన్నాడు. ‘ఆ డబ్బులు సరిపోతాయో లేదో తెలియదు. కానీ నా వంతు సాయం చేశా. వారికి ఒకడే కుమారుడు.
ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ఈ పని చేశా. నాకు వీలైనంత ఆ కుటుంబానికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తా. కోచ్‌లు, మిగతా ప్లేయర్లను సహాయం చేయమని విజ్ఞప్తి చేశా’ అని శరత్ కమల్ తెలిపాడు. జాతీయ టోర్నీలో పాల్గొనేందుకు గువాహటి నుంచి షిల్లాంగ్‌కు వెళుతున్న క్రమంలో విశ్వ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్ర గాయాల పాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ ప్లేయర్ మృతిపై ప్రధాని మోదీ పలువురు సంతాపం తెలిపారు. హైదరాబాద్‌లో ప్రొ తైక్వాండో టోర్నీ